SpiceJet | విమానాల్లో తరచూ సాంకేతిక సమస్యలు (Technical Snag) ఆందోళన కలిగిస్తున్నాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో సహా పలు విమానాల్లో తరచూ ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతున్న విషయం తెలిసిందే. తాజాగా బీహార్ రాజధాని పాట్నా (Patna) వెళ్తున్న స్పైస్‌జెట్ (SpiceJet) విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
స్పైస్‌జెట్‌కు చెందిన బోయింగ్ 737-8A విమానం ఇవాళ ఉదయం 9:41 గంటల సమయంలో ఢిల్లీ (Delhi) ఎయిర్పోర్ట్ నుంచి బీహార్ రాజధాని పాట్నాకు బయల్దేరింది. అయితే, విమానం టేకాఫ్ అయిన కాసేపటికే టెక్నికల్ ఎర్రర్ వచ్చింది. సాంకేతిక లోపం గుర్తించిన పైలట్ ఈ విషయాన్ని ఢిల్లీ ఏటీసీకి తెలియజేశారు. అనంతరం ఎయిర్పోర్ట్ అధికారుల సూచనల మేరకు విమానాన్ని ఢిల్లీకి మళ్లించారు. అక్కడ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయ్యింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. టెక్నికల్ సిబ్బంది విమానంలో లోపాన్ని గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నారు. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.
Also Read..
Heavy Rain | భారీ వర్షాలు.. నేడు ఈ ఐదు జిల్లాలకు అలర్ట్
PM Modi | మలేసియాలో ట్రంప్ – మోదీ భేటీ లేనట్లే.. ఆసియాన్ సదస్సులో వర్చువల్‌గా పాల్గొననున్న ప్రధాని
Donald Trump | మోదీ మాటిచ్చారు.. ఈ ఏడాది చివరినాటికి.. : ట్రంప్ నోట మళ్లీ అదేమాట