Heavy Rain | ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu) రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు (Heavy Rains) దంచికొడుతున్నాయి. చెన్నై (Chenai) సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లు, వీధులు నదులను తలపిస్తున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే, రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నేపథ్యంలో నేడు చెన్నై సహా ఐదు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది.
చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చంగల్పట్టు, రాణీపేట్.. ఈ ఐదు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ (Yellow Alert) జారీ చేసింది. పుదుచ్చేరి, కారైకల్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు తమిళనాడులోని అనేక జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నేడు భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే ధర్మపురి జిల్లా కలెక్టర్ పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, కొంకణ్, గోవా, అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ అంతటా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది.
Also Read..
PM Modi | మలేసియాలో ట్రంప్ – మోదీ భేటీ లేనట్లే.. ఆసియాన్ సదస్సులో వర్చువల్‌గా పాల్గొననున్న ప్రధాని
Donald Trump | మోదీ మాటిచ్చారు.. ఈ ఏడాది చివరినాటికి.. : ట్రంప్ నోట మళ్లీ అదేమాట
Donald Trump: పుతిన్‌తో మీటింగ్ రద్దు : ట్రంప్