Crypto Investersకు షాక్.. విదేశాలకు నిధుల మళ్లింపుకు ఐసీఐసీఐ నో!
Crypto Investersకు షాక్.. విదేశాలకు నిధుల మళ్లింపుకు ఐసీఐసీఐ నో!| క్రిప్టో ఇన్వెస్టర్లకు ఐసీఐసీఐ బ్యాంక్ గట్టి షాక్ ఇచ్చింది. వాటిల్లో ...

న్యూఢిల్లీ: మీరు క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయాలని సంకల్పించారా.. అందుకు విదేశాలకు నిధులు మళ్లించాలని యోచిస్తున్నారా.. అయితే, ఇక అలా చేయడానికి నిబంధనలు అనుమతించబోవు. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ ఈ మేరకు నిషేధం విధించింది.
ఇక విదేశాలకు డబ్బెందుకు పంపుతున్నారో చెప్పాల్సిందే
విదేశాలకు డబ్బులు పంపడానికి కారణాలు తెలియజేయాలని తన ఖాతాదారులకు ఐసీఐసీఐ బ్యాంక్ స్పష్టం చేసింది. క్రిప్టో కరెన్సీల్లో ఇన్వెస్ట్ చేయడానికి కాదని పేర్కొనాలని తెలిపింది.
ఈ మేరకు రిటైల్ ఔట్వార్డ్స్ రిమిట్టెన్స్ అప్లికేషన్ ఫామ్‌లో మార్పులు కూడా చేసింది. దీని ప్రకారం విదేశాలకు డబ్బు పంపే ఖాతాదారులు ఔట్‌వార్డ్ రిమిట్టెన్స్ అప్లికేషన్ ఫామ్ సమర్పించాల్సి ఉంటుంది.
విదేశాల్లో ఆస్తులు కొనాలన్నా, స్టాక్స్ కొనాలన్నా ఆయా బ్యాంకుల ఖాతాదారులు లిబరలైజ్డ్ రెమిట్టెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద సంతకం చేయాలని ఆర్బీఐ నిబంధన తెచ్చింది.
నేరుగా క్రిప్టో కరెన్సీల్లో మదుపు చేయడానికి మాత్రమే కాక ఇతర లావాదేవీలకు కూడా ఎల్ఆర్ఎస్ డిక్లరేషన్ తప్పనిసరిగా మారింది.
బ్యాంకు నిబంధనలకు ఖాతాదారులు తలొగ్గాల్సిందే
బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడానికి మ్యూచువల్ ఫండ్స్, షేర్లలో నిధులు మదుపు చేయడం లేదని పేర్కొంటూ ఎల్ఆర్ఎస్ రిమిట్టెన్స్ నిబంధనకు తలొగ్గాల్సిందే.
ఇప్పటికే క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలను పలు బ్యాంకులు నిలిపేశాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ రిమిట్టెన్స్ను క్రిప్టో అనుబంధ పెట్టుబడులకు వాడుకోవద్దని తన ఖాతాదారులను ఐసీఐసీఐ కోరింది.
ఫెమా నిబంధనల కింద ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ తన రిటైల్ ఔట్ వార్డ్స్ రిమిట్టెన్స్ అప్లికేషన్ ఫామ్‌లోనూ మార్పులు తీసుకొచ్చింది. అన్ని రకాల ఎల్ఆర్ఎస్ లావాదేవీల నిర్వహణకు ఈ నిబంధన వర్తిస్తుంది.
ఐసీఐసీఐతోపాటు ఇతర ప్రధాన బ్యాంకులు కూడా..
దేశంలోని ఓ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ వ్యవస్థాపకుడు స్పందిస్తూ.. క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులను నియంత్రించేందుకు ఐసీఐసీఐతోపాటు ఇతర ప్రధాన బ్యాంకులు కూడా ఇదే నిబంధనను అమలులోకి తెచ్చాయని చెప్పారు.
దీంతో ఎల్ఆర్ఎస్తో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టడానికి దారులు మూసుకు పోయాయి. దీంతో భారత క్రిప్టో కరెన్సీ మార్కెట్ లావాదేవీలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 2004లో ఆర్బీఐ ఈ ఎల్ఆర్ఎస్ నిబంధనను అమలులోకి తెచ్చింది.
ఈ వార్తలు కూడా చదవండి:
13న రాష్ర్ట మంత్రి వర్గ సమావేశం
స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు : మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
ఫన్88 బ్రాండ్ అంబాసిడర్‌గా డారెన్ సామి…
నాకు డ్రా ఈజీగానే ఉంది కానీ..: పీవీ సింధు
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా ధరల మంటతో ఉక్కిరిబిక్కిరి!
అన్‌లాక్ ప్రక్రియతో అందుబాటులోకి వచ్చిన మూడోవంతు కొలువులు!
జర్మనీ ఆటో సంస్థలపై రూ.7,500 కోట్ల ఫైన్
లగ్జరీ కార్లంటే యమ క్రేజ్.. పలు వేరియంట్లపై మోజు
ఢిల్లీలో మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

