ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా ధరల మంటతో ఉక్కిరిబిక్కిరి!

న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్‌తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్ నెల ఆర్థిక సమీక్షలో విశ్లేషించింది. మేలో ద్రవ్యోల్బణం, టోకు ధరల సూచీ ఏకంగా వరుసగా 6.3, 12.94 శాతానికి ఎగబాకడం ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధరలు లీటర్‌కు రూ వంద దాటడంతో ఇంధన ధరలు మండుతున్నాయని పేర్కొంది.
రుతుపవనాలు ఆశాజనకంగా ఉండటం, ఖరీఫ్ సాగు క్రమంగా పెరుగుతుండటం, అన్‌లాక్ ప్రక్రియ వేగవంతమవుతుండటంతో ధరలు దిగివస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా కలకలం నుంచి తేరుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు వ్యాక్సినేషన్‌ను వేగవంతంగా కొనసాగించడం, ఆరోగ్య మౌలిక వసతుల మెరుగుదల వంటి సవాళ్లను అధిగమించాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, ఎరువుల సబ్సిడీ పెంపు వంటి చర్యలతో రాబోయే త్రైమాసికాల్లో గ్రామీణ డిమాండ్ బలోపేతమవుతుందని అంచనా వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

