స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు : మంత్రి జగదీశ్ రెడ్డి
మంత్రి జగదీశ్ రెడ్డి | కొన్ని రాజకీయ పార్టీల నేతలు స్టంట్ మాస్టర్లలా వ్యవహరిస్తున్నారని, వారి స్టంట్లన్నీ కెమెరాలకే పరిమితం అని రాష్ట్ర విద్యుత్ శాఖ

సూర్యాపేట : కొన్ని రాజకీయ పార్టీల నేతలు స్టంట్ మాస్టర్లలా వ్యవహరిస్తున్నారని, వారి స్టంట్లన్నీ కెమెరాలకే పరిమితం అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఎద్దెవా చేశారు. అలాంటి నాయకులతో తెలంగాణ ప్రజలు నడిచేందుకు సిద్ధంగా లేరని మంత్రి స్పష్టం చేశారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వదులుకోవడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకొని మాట్లాడాలని సూచించారు. ముఖ్యమంత్రిగా తెలంగాణకు ఏమి చేశారు అన్నది ఇక్కడి ప్రజలకు స్పష్టంగా తెలుసు అని ఆయన తెలిపారు. అసలు ఈ రోజున అవాకులు చవాకులు పేలుతున్న వారికి వచ్చిన పదవులు ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన భిక్షనే అని మంత్రి అన్నారు.
తెలంగాణ అనే పదమే లేకపోతే.. వారికి ఈ పదవులు దక్కేవా అంటూ ఆయన సూటిగా ప్రశ్నించారు. పైరవీలతో పదవులు రావొచ్చు.. కానీ నోటికి వచ్చినట్లు మాట్లాడుతాం.. ఇష్టానుసారంగా బూతులు మాట్లాడుతాం అంటే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ఆయన హెచ్చరించారు. సందర్భం వచ్చినప్పుడు కారుకాల్చి వాత పెట్టడంలో తెలంగాణ సమాజం ముందుంటుందన్నారు. ప్రజాసేవే చేయాలని తాపత్రయపడుతున్న వారు ముందుగా ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేయాలి అని జగదీశ్ రెడ్డి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

