2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి
2 డీజీ | కరోనా చికిత్సకు వినియోగించే 2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్.. ఈ ఔషధ

హైదరాబాద్ : కరోనా చికిత్సకు వినియోగించే 2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఎంఎస్ఎన్ ల్యాబోరేటరీస్.. ఈ ఔషధ ఉత్పత్తికి సంబంధించి డీఆర్డీవోతో ఒప్పందం కుదుర్చుకుంది. డీఆర్డీవో డెవలప్ చేసిన 2 డీజీ ఔషధాన్ని కరోనా రోగులకు అత్యవసరంగా వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే డీఆర్డీవోతో ఎంఎస్ఎన్ ల్యాబ్ ఒప్పందం మేరకు.. 2 డీజీ ఔషధాన్ని ఎంఎస్ఎన్ 2డీ పేరుతో ఎంఎస్ఎన్ ల్యాబ్ మార్కెట్లోకి తీసుకురానుంది. 2.34 గ్రాములతో రోజుకు రెండు సాచెట్స్‌ను సదరు ల్యాబ్ ఉత్పత్తి చేయనుంది.
ఇప్పటికే ఎంఎస్ఎన్ ల్యాబ్ పలు రకాల కొవిడ్ మెడిసిన్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. యాంటీ వైరల్ మెడిసిన్స్‌ను ఒసెలో బ్రాండ్ పేరుతో ఓసెల్టామివిర్ క్యాప్సూల్స్‌ను విడుదల చేసింది. ఫావిలో బ్రాండ్ పేరుతో ఫావిపిరవిర్ వంటి యాంటీ కోవిడ్ మందులను, బారిడోజ్ బ్రాండ్ పేరుతో బారిసిటినిబ్, పోసాయోన్ బ్రాండ్ పేరుతో పోసాకోనజోల్ వంటి యాంటీ ఫంగల్ మెడిసిన్స్‌ను ఎంఎస్ఎన్ ల్యాబ్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- 2 dg
- Corona drug
- DRDO
- MSN Lab
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

