Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
బతుకమ్మ సంబురాల్లో స్థానిక గిరిజన మహిళ సర్పంచ్, ఉప సర్పంచ్ లపై సీఐ రమణ మూర్తి అకారణంగా దాడి చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకోకు దిగారు.
మంచిర్యాల, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి ) మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేటలో బతుకమ్మ సంబురాల్లో స్థానిక గిరిజన మహిళ సర్పంచ్ కుర్సింగ కళావతి, ఉపసర్పంచ్ పుట్టపాక తిరుపతి లపై సీఐ రమణ మూర్తి అకారణంగా దాడి చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకోకు దిగారు. స్థానికుల కథనం ప్రకారం.. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు వ్యతిరేకంగా జగన్ మోహనరావు వర్గంలో చేరిన తాళ్లపేట సర్పంచ్, ఉపసర్పంచ్ బతుకమ్మ వేడుకల్లో నిమగ్నమై ఉండగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గానికి చెందిన ఇద్దరి నాయకుల తో గొడవ జరిగింది.
సమాచారం అందుకున్న స్థానిక సీఐ రమణమూర్తి ఘటన స్థలానికి వచ్చి అకారణంగా తమ మీద దాడి చేశారు అని సర్పంచ్, ఉప సర్పంచ్ ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జగన్ మోహన్ రావు తాళ్లపేట కు చేరుకొని కాంగ్రెస్ నాయకులు, తన అనుచరులతో కలిసి అర్ధరాత్రి రాస్తారోకో నిర్వహించారు.
సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్..
జగన్మోహన్ రావు తో పలువురు నాయకులు రోడ్డుపై బైఠాయించారు. సీఐ ని సస్పెండ్ చేస్తామని డీసీపీ వచ్చి హామీ ఇచ్చే వరకు రాస్తారోకో విరమించేది లేదని భీష్మించుకొని కూర్చోవడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనలో ఎమ్మెల్యే వర్గీయలకు సైతం గాయాలు అయినట్లు సమాచారం. కాగా రాస్తారోకో చేస్తున్న సమయంలో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు దండేపల్లి ఉపసర్పంచ్ నవీన్ ఇతర నాయకులపై జగన్ వర్గానికి చెందిన నాయకులు ఒకేసారి విరుచుకుపడ్డారు. పోలీసులు స్పందించి అతని పోలీసు వాహనంలో బయటికి పంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపగా, ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ENE Repeat Trailer | ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్ విడుదల.. నలుగురు స్నేహితుల సందడి ఈసారి మరింత గ్రాండ్‌గా!
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

