హైదరాబాద్: డ్యాన్స్ చేయడమంటే ఆషామాషీ కాదు. ఐదు నిమిషాలు డ్యాన్స్ చేస్తే యువకులే ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరి అవుతుంటారు. కానీ ఓ వృద్ధుడు మాత్రం ఉత్సాహంగా డ్యాన్స్ చేసేందుకు వయసు అడ్డం కాదని నిరూపించాడు. ఓ పెండ్లి వేడుకలో అద్భుతమైన స్టెప్పులతో డ్యాన్స్ చేసి అదరగొట్టాడు. వృద్ధుడి స్టెప్పులు చూసి ఆ పెండ్లి వేడుకకు హాజరైన వారు ఫిదా అయ్యారు. ప్రణవ్ డోంక్ గుర్జర్ అనే ఓ వ్యక్తి వృద్ధుడి డ్యాన్స్‌ను తన ఫోన్ కెమెరాలో బంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 40 వేల మందికి పైగా ఆ వీడియోను వీక్షించారు. వ్యూయర్స్ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఆ వీడియో చూస్తే మీరు కేవలం నవ్వుకోవడం మాత్రమే కాదు.. హుషారుగా డ్యాన్స్ కూడా చేస్తారేమో..! అందుకే ఈ కింది వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి..
ఇవి కూడా చదవండి..
‘గిన్నిస్’కు ఎక్కిన గుర్రం బిగ్ జాక్ మృతి..!
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
కీలక నేతలతో ప్రధాని భేటీ రద్దు..!
ముంబైలో 88 బ్లాక్స్‌తో అతిపెద్ద పబ్లిక్ టాయిలెట్..!
ఇంటర్నెట్ తెచ్చిన తంటా.. చెట్టుపై నుంచి ఉపాధ్యాయుడి బోధన..!
చేపల కోసం వల వేస్తే కొండచిలువ చిక్కింది..!