లగ్జరీ కార్లంటే యమ క్రేజ్.. పలు వేరియంట్లపై మోజు
లగ్జరీ కార్లంటే యమ క్రేజ్.. పలు వేరియంట్లపై మోజు| కరోనాతో పర్సనల్ మొబిలిటీకి డిమాండ్ పెరిగింది. ప్రత్యేకించి లగ్జరీ కార్ల కొనుగోళ్లు కూడా ...

న్యూఢిల్లీ: గత నెలలో వాహనాల రిజిస్ట్రేషన్ పుంజుకున్నది. చౌక కార్ల నుంచి లగ్జరీకార్ల వరకు డిమాండ్ పెరిగింది. 2020తో పోలిస్తే గత నెలలో వాహనాల రిజిస్ట్రేషన్లు 22.62 శాతం పెరిగాయని ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య (ఫాడా) వెల్లడించింది. ప్రత్యేకించి మెర్సిడెస్ బెంజ్ కార్ల విక్రయాలు 65 శాతం పెరిగాయి.
తొలి ఆరు నెలల్లో మెర్సిడెస్ 65% గ్రోత్
ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో మెర్సిడెస్ కార్లు 4,857 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 64.75 శాతం గ్రోత్. గతేడాది తొలి ఆరు నెలల్లో 2,948 కార్లను మాత్రమే మెర్సిడెస్ విక్రయించింది. 2020లో కరోనా తొలి వేవ్ వేళ దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో కంపెనీలు సుదీర్ఘ కాలం మూతపడ్డాయి.
మెర్సిడెస్‌లో ఈ కార్లకు ప్రియారిటీ
మెర్సిడెస్ ఈ-క్లాస్ మోడల్ కారుకు అధిక డిమాండ్ ఉంది. ఈ ఏడాది ప్రారంభించిన న్యూ మోడల్ కార్లలో ఇదొకటి. గత ఆరు నెలల్లో అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఈ-క్లాస్ వేరియంట్ ఉంది. సెకండ్ జనరేషన్ జీఎల్ఎ, ఏ-క్లాస్ లిమౌసైన్స్ వేరియంట్ కార్ల కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మెర్సిడెస్‌లో పలు ఆప్షన్లకు కస్టమర్ల ప్రాధాన్యం
మెర్సిడెస్ కార్లలో కస్టమర్లు పలు ఆప్షన్లను ఎంచుకుంటున్నారు. ఏ-క్లాస్ లిమౌనైజ్, ఎఎంజీ ఏ 35 5 మాటిక్, న్యూ ఈ-క్లాస్, సెవెంత్ జనరేషన్ ఏ-క్లాస్, సెకండ్ జనరేషన్ జీఎల్ఏ, ఎఎంజీ జీఎల్ఎ 35 4 మ్యాటిక్, న్యూ జీఎల్సీ, జీఎల్ఎస్ మేమ్యాచ్ 600 4 మ్యాటిక్ ఎస్యూవీ కార్లకు ఫుల్ డిమాండ్ ఉంది.
జూన్ సేల్స్‌లో డబుల్ గ్రోత్
కరోనా సంక్షోభ వేళ కూడా జూన్‌లో కొన్ని కంపెనీల కార్ల సేల్స్‌లో డబుల్ గ్రోత్ నమోదైంది. మెర్సిడెస్ గతేడాది జూన్‌లో 305 యూనిట్లు విక్రయిస్తే, ఈ ఏడాది 546 కార్లు విక్రయించింది.
ఈ కంపెనీల కార్లకూ ప్రాధాన్యం
బీఎండబ్ల్యూ గతేడాది 155 యూనిట్ల కార్లను విక్రయిస్తే, ఈ ఏడాది 390 యూనిట్లు అమ్ముడయ్యాయి. వోల్వో, పోర్చె, బెంట్లీ, లంబోర్ఘిని, రోల్స్ రాయిస్ మోడల్ లగ్జరీ కార్ల కొనుగోళ్లకు డిమాండ్ పెరిగింది. అయితే, ఇతర మోడల్ కార్ల సేల్స్‌తో తగ్గితే విలాసవంతమైన మోడల్ కార్ల విక్రయాలు తక్కువే.
ఈ వార్తలు కూడా చదవండి:
13న రాష్ర్ట మంత్రి వర్గ సమావేశం
స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు : మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
ఫన్88 బ్రాండ్ అంబాసిడర్‌గా డారెన్ సామి…
నాకు డ్రా ఈజీగానే ఉంది కానీ..: పీవీ సింధు
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా ధరల మంటతో ఉక్కిరిబిక్కిరి!
అన్‌లాక్ ప్రక్రియతో అందుబాటులోకి వచ్చిన మూడోవంతు కొలువులు!
జర్మనీ ఆటో సంస్థలపై రూ.7,500 కోట్ల ఫైన్
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- BMW
- demand
- luxxury cars
- mersidese
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

