అన్‌లాక్ ప్రక్రియతో అందుబాటులోకి వచ్చిన మూడోవంతు కొలువులు!

న్యూఢిల్లీ : జూన్‌లో దశలవారీగా చేపట్టిన అన్‌లాక్ ప్రక్రియతో కరోనా సెకండ్ వేవ్‌లో కోల్పోయిన ఉద్యోగాల్లో మూడింట ఓ వంతు కొలువులు తిరిగి సమకూరాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించింది. సెకండ్ వేవ్‌లో 2.7 కోట్ల ఉద్యోగాలు కోల్పోగా జూన్‌లో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడినపడిన క్రమంలో 78 లక్షల ఉద్యోగాలు తిరిగి అందుబాటులోకి వచ్చాయని సీఎంఐఈ డేటా పేర్కొంది.
జూన్‌లో ఉపాధి అవకాశాలు పెరగడం, వ్యవసాయేతర ఉద్యోగాలు భారీగా తిరిగి సమకూరాయని, అయితే కోల్పోయిన ఉద్యోగాలన్నీ తిరిగి రికవర్ కావడం సవాల్‌తో కూడినదేనని సీఎంఐఈ తన వారాంతపు విశ్లేషణలో పేర్కొంది. అన్‌లాక్ ప్రక్రియతో తిరిగి సమకూరిన 78 లక్షల ఉద్యోగాల్లో అత్యధికం నగర ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయని వీటిలో రిటైల్ వ్యాపారం, టెక్స్టైల్స్, నిర్మాణ రంగాల నుంచి ఎక్కువ కొలువులున్నాయని తెలిపింది. ఇక జూన్‌లో మొదలైన రికవరీ నిలదొక్కుకుంటే సెకండ్ వేవ్‌లో కోల్పోయిన ఉద్యోగాలన్నీ తిరిగి సమకూరాలంటే మరికొన్ని నెలల సమయం పడుతుందని సీఎంఐఈ అంచనా వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

