e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News Punjab National Bank: ఛార్జ్‌ల ద్వారా 170 కోట్లు సంపాదించిన పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌

Punjab National Bank: ఛార్జ్‌ల ద్వారా 170 కోట్లు సంపాదించిన పంజాబ్‌ నేషనల్ బ్యాంక్‌

న్యూఢిల్లీ : ఖాతాలలో కనీస బ్యాలెన్స్ నిర్వహించనందుకు కస్టమర్లకు ఛార్జ్‌లు విధించడం ద్వారా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (Punjab National Bank) దాదాపు రూ.170 కోట్లు సంపాదించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే ఈ మొత్తాన్ని ముక్కు పిండి వసూలు చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ సమాచారం సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) ద్వారా వెలుగులోకి వచ్చింది. అలాంటి ఛార్జీల ద్వారా బ్యాంక్ సంపాదించిన లాభం 2019-20లో రూ.286.24 కోట్లుగా ఉన్నది. బ్యాంకులు త్రైమాసిక ప్రాతిపదికన ఈ ఛార్జీలను విధిస్తాయి.

పొదుపు, కరెంట్‌ ఖాతాలపై 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ కాలంలో త్రైమాసిక సగటు బ్యాలెన్స్ (క్యూఏబీ) రూ.35.46 కోట్లుగా ఉండగా, 2021 రెండో త్రైమాసికంలో అలాంటి రుసుం విధించలేదని పీఎన్‌బీ స్పష్టం చేసింది. మూడు, నాలుగో త్రైమాసికాల్లో క్యూఏబీ నాన్-మెయింటెనెన్స్ ఛార్జీలు వరుసగా రూ.48.11 కోట్లు, రూ.86.11 కోట్లుగా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా, ప్రతిస్పందనగా ఈ విషయాలను పీఎన్‌బీ వెల్లడించింది.

- Advertisement -

ఏడాదిలో ఏటీఎం లావాదేవీల ఛార్జీలుగా బ్యాంక్ రూ.74.28 కోట్లు సంపాదించింది. 2019-20లో ఇది రూ.114.08 కోట్లుగా ఉండగా.. 2020-21 తొలి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఏటీఎం లావాదేవీ ఛార్జీలను మినహాయించినట్లు బ్యాంక్ పేర్కొన్నది. ఆపరేటివ్, నాన్‌ ఆపరేటివ్‌ ఖాతాల సంఖ్యపై అడిగిన ప్రశ్నకు.. 2021 జూన్ 30 నాటికి 4,27,59,597 ఖాతాలు ఇన్‌యాక్టీవ్‌గా ఉన్నాయని, మొత్తం 13,37,48,857 ఖాతాలు పనిచేస్తున్నాయని బ్యాంక్ తెలిపింది.

ఇవి కూడా చ‌ద‌వండి..

చేనేత, వృత్తి కళాకారులకు అండగా జీఈఎం పోర్టల్‌

తికాయత్‌ ఒక డెకాయిట్‌: ఎంపీ అక్షైబర్‌ లాల్‌ గోండ్‌

వ్యాక్సిన్‌ తీసుకోలేదా? అయితే, ప్రభుత్వ సేవలు బంద్‌

అధికారులు మా చెప్పులు మోస్తారు : ఉమాభారతి వివాదాస్పద వ్యాఖ్యలు

ఆరోసారి వ్యాక్సిన్‌ డోసు కోసం వచ్చిన బీజేపీ నేత.. ఎలా దొరికాడంటే?

2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్‌.. ఎలాగంటే?

పాకిస్తాన్‌లో రెపరెపలాడిన తాలిబాన్‌ జెండాలు.. చిక్కుల్లో ఇమ్రాన్‌ఖాన్‌

వివాదాల సుడిగుండంలో పంజాబ్‌ కొత్త సీఎం

సిమ్లా విడిదిలో సోనియాగాంధీ

ఢిల్లీలో పాగా వేసిన ఈస్ట్‌ఇండియా కంపెనీ

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement