No vaccine, no entry : వ్యాక్సిన్ తీసుకోలేదా? అయితే, ప్రభుత్వ సేవలు బంద్
No vaccine, no entry : టీకా తీసుకోని వారికి ప్రవేశం లేదు.. ఇది ఇవాల్టి నుంచి గుజరాత్ ప్రధాన నగరం అహ్మదాబాద్‌లో అమలు చేస్తున్న నిర్ణయం. వ్యాక్సిన్ తీసుకోని వారు ప్రజా రవాణాతో పాటు...

అహ్మదాబాద్ : (No vaccine, no entry) టీకా తీసుకోని వారికి ప్రవేశం లేదు.. ఇది ఇవాల్టి నుంచి గుజరాత్ ప్రధాన నగరం అహ్మదాబాద్‌లో అమలు చేస్తున్న నిర్ణయం. వ్యాక్సిన్ తీసుకోని వారు ప్రజా రవాణాతో పాటు ఇతరత్రా ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించకుండా చూస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసేందుకు అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఏఎంసీ) చర్యలు తీసుకుంటున్నది. బస్సు ఎక్కాలన్నా, ఆఫీసుల్లోకి వెళ్లాలన్నా వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికేట్ విధిగా చూపించాలని అధికారులు పేర్కొంటున్నారు.
కరోనాను సమర్థంగా నివారించేందుకు అహ్మదాబాద్ యంత్రాంగం సన్నద్ధమైంది. ఇప్పటివరకు కొవిడ్-19 కి వ్యతిరేకంగా ఒక్క టీకా కూడా తీసుకోని వారిని పౌర రవాణా సేవ వంటి ప్రజా సౌకర్యాలను ఉపయోగించకుండా, ప్రభుత్వ భవనాలలోకి ప్రవేశించకుండా సోమవారం నుంచి నిషేధం విధించారు. వ్యాక్సిన్ తీసుకోని వారిని సిటీ బస్సులతోపాటు కంకరియా లేఖ్ ఫ్రంట్, సబర్మతి రివర్ ఫ్రంట్, గ్రంథాలయాలు, జిమ్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్సుల్లోకి అనుమతించమని అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ ముఖేశ్ కుమార్ వెల్లడించారు. 18 ఏండ్ల వయసు పైబడిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా భౌతిక కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లేదా ఈ-కాపీని తమ మొబైల్లో కలిగి ఉండాలని, ఈ సర్టిఫికేట్లను తనిఖీ చేసిన తర్వాతనే కార్యాలయాల్లోకి, బస్సుల్లోకి అనుమతిస్తారని ఏఎమ్‌సీ డైరెక్టర్ జిగ్నేష్ పటేల్ చెప్పారు. ఈ నిర్ణయాన్ని గత కొన్ని రోజులుగా విశేషంగా ప్రచారం చేస్తున్నారు.
కరోనా టీకా తీసుకోనిదే కార్యాలయాలు, బస్సుల్లోకి అనుమతించమని తీసుకున్న నిర్ణయంపై అహ్మదాబాద్ వాసులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది మంచి చొరవ అని, ఈ రకమైన కఠిన నిర్ణయం ప్రజలు తీసుకోవడానికి ప్రోత్సహిస్తుందని వారంటున్నారు. ప్రతి ఒక్కరూ టీకాలు తీసుకోవడం ద్వారానే కొవిడ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా చూడవచ్చునని, ఏఎంసీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పార్క్ లోపల ఒక సందర్శకుడు చెప్పారు. చాలా మంది ముఖానికి మాస్క్ లేకుండా తిరుగుతున్నారని, దీనిపై కూడా దృష్టిసారించాలని పలువురు కోరుతున్నారు. గుజరాత్ అధికారులు తెలపిన వివరాల ప్రకారం, గుజరాత్ రాష్ట్రంలో ప్రస్తుతం 136 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే, మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 4 కోట్లకు పైగా ఉన్నది.
ఇవి కూడా చదవండి..
అధికారులు మా చెప్పులు మోస్తారు : ఉమాభారతి వివాదాస్పద వ్యాఖ్యలు
ఆరోసారి వ్యాక్సిన్ డోసు కోసం వచ్చిన బీజేపీ నేత.. ఎలా దొరికాడంటే?
2-3-4 ఫార్ములాతో బీపీ కంట్రోల్.. ఎలాగంటే?
పాకిస్తాన్లో రెపరెపలాడిన తాలిబాన్ జెండాలు.. చిక్కుల్లో ఇమ్రాన్‌ఖాన్
వివాదాల సుడిగుండంలో పంజాబ్ కొత్త సీఎం
ఢిల్లీలో పాగా వేసిన ఈస్ట్ఇండియా కంపెనీ
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

