Maruti Cars Very Costly | దేశంలోనే అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మరోమారు తమ కార్ల ధరలు పెరుగుతాయని ప్రకటించింది. ఇన్పుట్ కాస్ట్ భారం తగ్గించుకునేందుకు జనవరిలో కార్ల ధరలు పెంచుతున్నట్లు గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2021 జనవరి నుంచి ఇప్పటివరకు పలు దఫాలు మారుతి సుజుకి కార్ల ధరలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కాలంలో మారుతి కారు ధర సగటున రూ.90 వరకు పెరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో నాలుగో దఫా వివిధ మోడళ్ల కార్ల ధరల పెంపునకు మారుతి సుజుకి సిద్ధమైంది. వచ్చే జనవరి నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని వివరించింది. మోడల్ టు మోడల్ కార్ల ధరల పెంపులో తేడా ఉంటుందని ప్రకటించింది. అంతకు మించి వివరాలను మారుతి సుజుకి వెల్లడించలేదు.
ఏడాది కాలంగా వివిధ రకాల ఇన్పుట్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోయింది. కార్ల తయారీపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. ఈ తరుణంలో పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని ధరల పెంపు ద్వారా వినియోగదారులపై మోపనున్నట్లు మారుతి సుజుకి పేర్కొన్నది. హ్యాచ్‌బ్యాక్ ఆల్టో నుంచి ఎస్-క్రాస్ ఎస్యూవీ మోడల్ వరకు వివిధ శ్రేణుల కార్లను మారుతి సుజుకి తయారు చేస్తున్నది.
ఇంతకుముందు సెప్టెంబర్‌లో కార్ల ధరలను మారుతి సుజుకి పెంచేసింది. చౌక ధరకు లభించే ఎంట్రీ లెవెల్ ఆల్టో కారు ధర రూ.18 వేలు, మిగతా మోడల్స్ కార్ల ధరలు రూ.10-25వేల వరకు పెంచింది. స్విఫ్ట్, డిజైర్, ఎకో, ఎర్టిగా, ఎస్-ప్రెస్సో మోడల్ కార్ల ధరలు మరింత పెరిగి రూ.25 వేల మేరకు కస్టమర్లపై భారం మోపింది.
ఈ ఏడాది జనవరిలో తొలిసారి ఎంపిక చేసిన కార్ల ధరలు గరిష్ఠంగా రూ.34 వేలు పెంచేసింది. ఏప్రిల్‌లో రెండో దఫా 1.6 శాతం అంటే రూ.22,500 వరకు పెంచింది. ముచ్చటగా మూడోసారి జూలైలో స్విఫ్ట్ హాచ్బ్యాక్తోపాటు అన్ని సీఎన్జీ మోడల్ కార్ల ధరలను పెంచింది.
ధరల పెరుగుదలకు మారుతి సుజుకి మూడు కారణాలు చెబుతున్నది. ఏడాదిలో స్టీల్ ధరలు 50 శాతం పెరిగింది. దీనికి తోడు కరోనా వేళ సెమీ కండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా మార్కెట్లో కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో సెమీ కండక్టర్లు, చిప్‌లు కొనులు చేయాల్సి వస్తున్నదని మారుతి సుజుకి వాదిస్తున్నది. దీనికితోడు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోవడంతో కార్ల రవాణా వ్యయ భరితంగా మారింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Mehendi Blouse : చీర కట్టింది కానీ నో జాకెట్.. మెహందీతో బ్లౌజ్ డిజైన్.. నెటిజన్లు చూసి షాక్
వ్యాక్సిన్ వేయించుకుంటే డేటింగ్ చేస్తా.. యువతి బంపర్ ఆఫర్.. ఎక్కడో తెలుసా?
jayabharathi |ఆడవాళ్లు డ్రైవింగ్ నేర్చుకుని ఏం చేస్తారనే ప్రశ్నకు ఇదే నా జవాబు
3 అడుగుల వరుడు.. 2 అడుగుల వధువు.. 7 అడుగుల బంధం
అరుదైన రెండు తలల బల్లిని చూశారా ఎప్పుడైనా?.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు.. వైరల్ వీడియో