వ్యవసాయ సీజన్లో కరువు పనులా.. నీళ్లియ్యకుండా పంటలు ఎండపెడుతరా?
కూలీలకు చేతినిండా వ్యవసాయ పనులు ఉండాల్సిన వానకాలంలో కరువు పనులు చేయించడం దౌర్భాగ్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పు ల మండలం బంజరలో వీబీజీరామ్‌జీ పథకంలో చెరువులో చేపట్టిన కరువు పనుల వద్ద కూలీలతో బుధవారం ఆయన మాట్లాడారు. తమ పొలాలు ఎండిపోవడంతో పొట్టతిప్పల కోసం కరువు పనులకు వచ్చామని రైతులు విచారం వ్యక్తంచేశారు.
- సర్కార్ తీరుపై ఎర్రబెల్లి ఫైర్
- జనగామ జిల్లా బంజరలో రైతు కూలీలతో మాటామంతీ
దేవరుప్పుల, సెప్టెంబర్ 23 : కూలీలకు చేతినిండా వ్యవసాయ పనులు ఉండాల్సిన వానకాలంలో కరువు పనులు చేయించడం దౌర్భాగ్యమని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. జనగామ జిల్లా దేవరుప్పు ల మండలం బంజరలో వీబీజీరామ్‌జీ పథకంలో చెరువులో చేపట్టిన కరువు పనుల వద్ద కూలీలతో బుధవారం ఆయన మాట్లాడారు. తమ పొలాలు ఎండిపోవడంతో పొట్టతిప్పల కోసం కరువు పనులకు వచ్చామని రైతులు విచారం వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనలో బంజర చెరువును ఏడాదిలో రెండుసార్లు నిం పేవారని వారు గుర్తుచేశారు. దీనిపై ఎర్రబెల్లి స్పందిస్తూ.. పాలిచ్చే బర్రెను అమ్ముకొని దున్నపోతును కొనుక్కున్నారని, ఇంకా రెం డేండ్లు ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. వానకాలంలో వ్యవసాయ పనులు చేసుకోవాల్సిన రైతులు, కూలీలు ఇంకా చెరువుల్లో కరు వు పనులు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి ని దర్శనమని విమర్శించారు.
నీరుండి ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండగా, నీరులేక పంట పొలాలు ఎండిపోయి విధిలేక రైతు కూలీలు వానకాలంలో కరువు పనులు చేపట్టాల్సిన దుస్థితిని ప్రభుత్వం కల్పించిందని మండిపడ్డారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన కరువని దుయ్యబట్టారు. దేవాదుల పంపులు ఆన్ చేస్తే దేవరుప్పుల చెరువులో నీరు చేరేదని అన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌తో మాట్లాడినా ఫలితం లేదని విచారం వ్యక్తంచేశారు. కేసీఆర్ సాగునీటి వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేస్తే.. కాంగ్రెస్ సర్కార్ నీటి మేనేజ్మెంట్ తెలియక రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని ధ్వజమెత్తారు. రైతులకు సాగునీరిస్తే కేసీఆర్‌కే మంచి పేరొస్తుందని కాంగ్రెస్ సర్కార్‌కు భయం పట్టుకున్నదని దుయ్యబట్టారు. హరీశ్‌రావుకు నెలరోజులపాటు సాగునీటి శాఖను అప్పగిస్తే ప్రాజెక్టుల పరిధిలోని భూములకు సాగునీరందిస్తారని స్పష్టంచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

