హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తేతెలంగాణ) : థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోవడంపై ప్రజల ముందు నిజనిజాలు బట్టబయలు చేస్తామని కేటీఆర్ హెచ్చరించడం, బీఆర్ఎస్ పోరాటాని కి సిద్ధంకావడంతో సర్కార్‌లో కదలిక వ చ్చింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అల్టిమేటంతో దిగొచ్చిన రేవంత్ సర్కా ర్.. బుధవారం రాత్రి హడావుడిగా విద్యు త్తు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై సమీక్ష చేసిం ది. మొన్న జూరాల నీటి విడుదల విషయంలోనూ కేటీఆర్ అల్టిమేటంతోనే మే ల్కొన్న సర్కార్.. ఆగమేఘాల మీద నీటి విడుదలపై కర్ణాటకతో చర్చలు జరిపి ఒత్తి డి తెస్తున్నట్టు బిల్డప్ ఇచ్చింది. ఆలస్యంగా కండ్లుతెరిచి నీటిని విడుదల చేస్తామని ప్రకటించింది.
ఇక విద్యుత్, బొగ్గు నిల్వల విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించిం ది. బుధవారం ఉదయం కేటీఆర్ ప్రెస్మీ ట్ పెట్టడంతో హడలిపోయిన సీఎం రేవంత్.. థర్మల్ ప్లాంట్ల వద్దకు బీఆర్ఎస్ నాయకులు వెళ్తే తమ ప్రభుత్వ బండారం బయటపడుతుందనే భయంతో విద్యుత్‌రంగం, బొగ్గు నిల్వలపై బుధవారం రాత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు, ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్‌మిట్టల్ తదితరులు హాజరయ్యారు. రాత్రి పది గంటల దాకా కొనసాగిన సమావేశంలో విద్యుత్ నిర్వహ ణ, బొగ్గు ఉత్పత్తిపై తన మూడేండ్ల పాల నా పాపాన్ని.. గత పదేండ్ల కేసీఆర్ సర్కార్‌కు అంటగట్టి తప్పించుకొనే ప్రయత్నం చేశారు. కానీ ఏమీపాలుపోక అధికారులపై హూంకరించారు.
మీ తప్పిదాల వల్లే ఈ దుస్థితి వచ్చిందని అధికారులపై నెపం నెట్టేయజూశారు. యాదాద్రి ప్లాంట్‌లో ఉత్పత్తి ఎందుకు నిలిచిపోయిందని, పూర్తిస్థాయి లో ఎందుకు ఉత్పత్తి చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. మూడేండ్లుగా విద్యుత్ నిర్వహణ, బొగ్గు నిల్వలపై మొద్దునిద్ర నటించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కేటీఆర్ హెచ్చరికలతో రాష్ట్రంలోని థర్మల్ప్లాంట్లల్లో బొగ్గు కొరత, వరుసగా విద్యుత్తు ప్లాంట్లల్లో ఉత్పత్తి నిలిచిపోవడం, కరెంట్ కోతలపై బుధవారం రాత్రి ఆరా తీశారు. సింగరేణి నుంచి జీ9 గ్రేడ్ బొగ్గు లభ్యతను అడిగి తెలుసుకున్నారు. అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదాద్రి, భదాద్రి, కేటీపీఎస్ ప్లాంట్లను పూర్తిచేయడంలో నిర్లక్ష్యం చేయడం, 14 బొగ్గు బ్లాకులు మూతపడేందుకు వారే కారణమని చెప్పి తప్పించుకొనేందుకు యత్నించారు. రెండు, మూడు నెలల నుంచి విద్యుత్ ఉత్పత్తి, సరఫరాలో ఇబ్బందులు ఎదురైనా పట్టించుకోని ప్రభు త్వం సమస్య తీవ్రమైన తర్వాత నిద్రమేల్కొనడంపై విమర్శలొస్తున్నాయి.