e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home News మార్కెట్ల ‘బ్ల‌డ్‌బాత్‌‌’: ఇన్వెస్ట‌ర్ల‌లో ‘నెర్వ‌స్‌’నెస్‌!

మార్కెట్ల ‘బ్ల‌డ్‌బాత్‌‌’: ఇన్వెస్ట‌ర్ల‌లో ‘నెర్వ‌స్‌’నెస్‌!

మార్కెట్ల ‘బ్ల‌డ్‌బాత్‌‌’: ఇన్వెస్ట‌ర్ల‌లో ‘నెర్వ‌స్‌’నెస్‌!

ముంబై: కరోనా రెండోవేవ్ మ‌హోగ్ర‌రూపం దాలుస్తుండ‌టంతో మ‌దుప‌ర్లు ఆందోళ‌న‌కు గుర‌య్యారు. ఒక్క‌రోజులోనే కొవిడ్‌-19 పాజిటివ్ కేసులు ల‌క్ష‌కు పైగా న‌మోదు కావ‌డంతో దేశంలో లాక్‌డౌన్ విధిస్తార‌న్న ఆందోళ‌న‌లు వ్య‌క్తం అయ్యాయి. ఫ‌లితంగా సోమ‌వారం దేశీయ స్టాక్ మార్కెట్లు నెత్తురోడాయి.

ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి నిఫ్టీ ఫార్మా స్క్రిప్ట్‌లు మిన‌హా అన్ని రంగాల షేర్లు అమ్మ‌కాల ఒత్తిడికి గుర‌య్యాయి. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ఆటోమొబైల్‌, మెట‌ల్ ఇండెక్స్‌లు స‌హా అన్ని స్టాక్స్ భారీ న‌ష్టాల‌తో ప‌త‌నం అయ్యాయి.

సోమ‌వారం ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ సుమారుగా 1900 పాయింట్లు న‌ష్ట‌పోయింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ-50 దాదాపు 590 పాయింట్లు న‌ష్ట‌పోయింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 47,693 పాయింట్ల‌కు ప‌త‌నం కాగా, నిఫ్టీ 14,249 పాయింట్ల‌కు ప‌డిపోయింది.

ప్ర‌ధాన ఇండెక్స్‌ల‌న్నీ 3.5 శాతం న‌ష్ట‌పోయాయి. ఫ‌లితంగా బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్‌లోని వివిధ సూచీల్లో మ‌దుప‌ర్ల సంప‌ద దాదాపు రూ. 8 ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌డిపోయింది. త‌ద్వారా బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.20.10 ల‌క్ష‌ల కోట్ల‌కు ప‌త‌న‌మైంది.

ఉద‌యం 10.40 గంట‌ల ప్రాంతంలో ప్రధాన షేర్లన్నీ అమ్మకాల ఒత్తిడికి గురి కావడంతో కేవలం 15 నిమిషాల్లో ఇన్వెస్టర్లు రూ.6,86,708.74 కోట్ల సంపద కోల్పోయారు. బీఎస్ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1708 పాయింట్లు పతనం కాగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 14,310.38 పాయింట్లదిగువకు పడిపోయింది.

ఉదయం సెషన్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 1479.15 పాయింట్లు కోల్పోయింది. దీంతో మదుపర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్ విలువ రూ.6,86,708.74 కోట్లు తగ్గి రూ. 2,02,76,533.13కోట్లకు చేరింది.

టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఇండ‌స్ ఇండ్ బ్యాంక్, బ‌జాజ్ ఫైనాన్స్ త‌దిత‌ర స్క్రిప్టులు నిఫ్టీలో భారీగా న‌ష్టపోయాయి. కానీ రెడ్డీస్ ల్యాబోరేట‌రీస్‌, సిప్లా, దివిస్ ల్యాబ్స్ వంటి ఫార్మా షేర్లు, బ్రిటానియా ఇండ‌స్ట్రీస్ స్క్రిప్ట్ లాభ ప‌డ్డాయి.

అన్ని రంగాల సెక్టోర‌ల్ ఇండెక్స్‌లు రెడ్‌తో ముగిసాయి. పీఎస్‌యూ బ్యాంక్ షేర్ 9 శాతానికి పైగా, ఆటో, ఇంధ‌నం, ఇన్‌ఫ్రా, మెట‌ల్ ఇండెక్స్‌లు 4-5 శాతం న‌ష్ట‌పోయాయి. బీఎస్ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 4-5 శాతం ప‌త‌నం అయ్యాయి.

దేశీయ అవ‌స‌రాల కోసం ర‌ష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వీని అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో వినియోగించేందుకు కేంద్ర నిపుణుల క‌మిటీ ఆమోదం తెలుప‌డంతో రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ ఏడు శాతానికి పైగా లాభ‌ప‌డింది.

ఇవి కూడా చ‌ద‌వండి:

క‌రోనా క‌ల్లోలం.. ఇండియాలో కొత్త‌గా 1.69 ల‌క్ష‌ల కేసులు

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

బెస్ట్ డైర‌క్ట‌ర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు

కుంభ‌మేళా.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తులు

బాఫ్టా అవార్డ్ వేడుక‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప్రియాంక చోప్రా, నిక్

సెకండ్ వేవ్‌.. ధారావి మ‌ళ్లీ విజేత‌గా నిలుస్తుందా ?

క‌రోనా ఎఫెక్ట్‌: అక్క‌డ 18 జిల్లాల్లో లాక్‌డౌన్

హ‌రిద్వార్‌లో నిరంజ‌ని సాధ‌వుల పుణ్య స్నానాలు

కుంభ‌మేళా.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తులు

బెడ్ల కొర‌త‌.. వీల్ చైర్ల‌పైనే రోగుల‌కు చికిత్స‌

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

ఈ స్మార్ట్‌ ఫోన్‌ పై రూ.40వేల తగ్గింపు

రూ.46 వేల‌కు పైనే ప‌సిడి ధ‌ర

బంగారం షాపుల్లో రద్దీ

క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్‌.. అప్లై ఎలా చేయాలంటే..

క‌రోనా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత

ఓటమి భయంతో దీదీలో అలజడి : మోదీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మార్కెట్ల ‘బ్ల‌డ్‌బాత్‌‌’: ఇన్వెస్ట‌ర్ల‌లో ‘నెర్వ‌స్‌’నెస్‌!

ట్రెండింగ్‌

Advertisement