2nd wave Loans demand | రుణాలకు ఫుల్ డిమాండ్.. బట్ తగ్గిన పారిశ్రామిక లోన్స్ !!
2nd wave Loans demand | కోవిడ్-19 ఉధ్రుతి ప్రభావంతో రుణాలకు డిమాండ్ పెరుగుతున్నది. గతేడాదితో పోలిస్తే జూన్‌లో 11.9 శాతం పర్సనల్ లోన్స్ పెరిగా.....

2nd wave Loans demand | కోవిడ్-19 ఉధ్రుతి ప్రభావంతో రుణాలకు డిమాండ్ పెరుగుతున్నది. గతేడాదితో పోలిస్తే జూన్‌లో 11.9 శాతం పర్సనల్ లోన్స్ పెరిగాయి. అవి గతేడాది జూన్‌లో 10.4 శాతం మాత్రమే. కోవిడ్, ఇతర కారణాల వల్ల జూన్‌లో బంగారం ఆభరణాలపై తీసుకోవడానికి మొగ్గు చూపారని రిజర్వు బ్యాంక్ సెక్టోరల్ డెవలప్మెంట్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్-జూన్ 2021 రిపోర్ట్ వెల్లడించింది. అదే సమయంలో వెహికల్స్ కొనుగోళ్లకు ఎక్కువ రుణాలు తీసుకున్నారు.
5.9 % పెరిగిన నాన్ ఫుడ్ రుణాలు
సుమారు 90 శాతం మంది తీసుకున్న రుణాలన్నీ నాన్-ఫుడ్ లోన్లే కావడం గమనార్హం. 2020తో ఇవే రుణాలు ఆరు శాతం మాత్రమే. ఈ ఏడాది 5.9 శాతం ఎక్కువయ్యాయని దేశంలోని 33 వాణిజ్య బ్యాంకులు ఇచ్చిన రుణాల డేటా చెబుతున్నది. ఈ పీరియడ్‌లోని మొత్తం రుణాల్లో 11.4 శాతానికి పైగా వ్యవసాయం, దాని అనుబంధ అవసరాలకు తీసుకున్నవే. గతేడాదితో పోలిస్తే 2.4 శాతం ఎక్కువయ్యాయి.

తగ్గిన పారిశ్రామిక రుణాలు
గమ్మత్తేమిటంటే పారిశ్రామిక అవసరాల కోసం రుణాలు మాత్రం స్వల్పంగా 0.3 శాతం తగ్గుముఖం పట్టడం ఆసక్తికర పరిణామం. గతేడాది 2.2 శాతం ఎక్కువయ్యాయి. గత జూన్‌లో మధ్య తరహా పరిశ్రమల రుణాలు 54.6, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల రుణాలు 6.4 శాతం పెరిగాయి. భారీ పరిశ్రమలు తీసుకున్న రుణాలు 3.4 శాతమే.
నెమ్మదించిన సర్వీస్ సెక్టార్ రుణాలు
ఇక సర్వీస్ సెక్టార్ లోన్ గ్రోత్ 2.9 శాతానికే పరిమితమైంది. గతేడాది జూన్‌లో సర్వీస్ సెక్టార్ 10.7 శాతం రుణాలు తీసుకున్నది. కానీ కమర్షియల్ రియల్ ఎస్టేట్, ఎన్బీఎఫ్సీ, టూరిజం, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి కూడా రుణాలకు డిమాండ్ తగ్గుముఖం పట్టింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
ICICI Bank alert | ఆగస్టు నుంచి ఖాతాదారుల లావాదేవీలపై చార్జీల మోత..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

