ICICI Bank alert | ఆగస్టు నుంచి ఖాతాదారుల లావాదేవీలపై చార్జీల మోత..!
ICICI Bank | ప్రైవేట్ బ్యాంకర్ ఐసీఐసీఐ బ్యాంక్ ( ICICI Bank ) తన సర్వీస్ చార్జీలను ఆగస్టు నుంచి సవరించాలని నిర్ణయించుకున్న....

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తోపాటు ప్రైవేట్ బ్యాంకర్ ఐసీఐసీఐ బ్యాంక్ ( ICICI Bank ) తన సర్వీస్ చార్జీలను ఆగస్టు నుంచి సవరించాలని నిర్ణయించుకున్నది. దేశీయ సేవింగ్స్ ఖాతాదారుల నగదు లావాదేవీలు, ఏటీఎం ఇంటర్ చేంజ్, చెక్‌బుక్ చార్జీలు సవరిస్తున్నట్లు తన వెబ్సైట్లో నోటీసు జారీ చేసింది. ఆదివారం నుంచి అమలులోకి రానున్న సవరించిన చెక్‌బుక్ చార్జీలు, ఏటీఎం క్యాష్ విత్ డ్రాయల్స్ చార్జీలు తెలుసుకుందాం..
మెట్రో సిటీల్లో మూడు లావాదేవీలే ఉచితం
ఐసీఐసీఐ రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాదారులు దేశంలోని ఆరు మెట్రో నగరాల పరిధిలో నెలకు తొలి మూడు లావాదేవీలు మాత్రమే ఉచితం. ఇతర ప్రాంతాల్లో తొలి ఐదు లావాదేవీలు ఉచితం.
పరిధి దాటితే ఆర్థిక లావాదేవీలపై రూ.20, ఆర్థికేతర లావాదేవీలపై రూ.8.50 చొప్పున చార్జీ వసూలు చేస్తుంది.
4 క్యాష్ లావాదేవీలు ఫ్రీ
ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారులు నెలలో నాలుగు క్యాష్ లావాదేవీలు ఉచితం. దాన్ని మించి జరిపే లావాదేవీలపై రూ.150 చార్జీ విధిస్తుంది.
వచ్చే నెల నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు తమ సొంత శాఖలో నెలలో రూ.లక్ష వరకు ఉచితంగా డ్రా చేసుకోవచ్చు. ఆ పరిమితం దాటితే ప్రతి రూ.1000పై రూ.5 చొప్పున సర్వీస్ చార్జీ విధించనున్నట్లు తెలిపింది. కనీస చార్జీ రూ.150 ఉంటుంది.
ఇతర శాఖల్లో రూ.25 వేలు దాటితే సర్వీస్ చార్జీ
ఇతర బ్రాంచీల్లో ప్రతిరోజూ రూ.25 వేల వరకు ఉచితం. రూ.25 వేలు దాటితే ప్రతి రూ.1000పై రూ.5 సర్వీస్ చార్జీ వసూలు చేస్తారు. కనీస చార్జీ రూ.150గా ఉంటుంది.
థర్డ్ పార్టీ లావాదేవీల్లోనూ ప్రతి రోజూ రూ.25 వేల వరకు ఉచితం. దాన్ని మించిన లావాదేవీలపై ఒక్కో థర్డ్ పార్టీ లావాదేవీకి రూ.150 చార్జీ విధిస్తారు.
ఏటా 25 లీవ్స్ చెక్‌బుక్ ఫ్రీ
ఐసీఐసీఐ బ్యాంకు సేవింగ్స్ ఖాతాదారులు ప్రతిఏటా ఉచితంగా 25 పేయబుల్ చెక్ లీవ్స్ ఉచితంగా పొందొచ్చు. అంతకు మించితే ప్రతి 10 లీవ్స్ అదనపు చెక్‌బుక్‌పై రూ.20 వసూలు చేస్తుంది.
సీనియర్ సిటిజన్లు, యంగ్ స్టార్, స్మార్ట్ స్టార్ ఖాతాదారులకు ప్రతి రోజూ రూ.25 వేల వరకు థర్డ్ పార్టీ లావాదేవీలు యధాతథంగా చేసుకోవచ్చు. వీటిపై సర్వీస్ చార్జీలు ఉండవు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
బంగారానికి ఫుల్ గిరాకీ.. ఎంతంటే?!
సక్సెస్‌ఫుల్‌గా ఐటీ ఈ-ఫైలింగ్ పోర్టల్.. 25.82 లక్షల ఐటీఆర్స్ దాఖలు
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
Parking Dispute: పార్కింగ్ వివాదం.. 15 రౌండ్ల కాల్పులు.. టెక్ మహేంద్ర మాజీ ఉద్యోగి మృతి
Y.S. Jagan | వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అక్రమ అరెస్టు అత్యంత హేయం : వైఎస్ జగన్
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
Adilabad Rims Hospital | ఆదిలాబాద్ రిమ్స్‌లో శిశువు మృతి.. కుటుంబసభ్యుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

