ధర రూ.4.98 లక్షలు
న్యూఢిల్లీ, జూలై 29: ఇటలీకి చెందిన సూపర్ బైకుల తయారీ సంస్థ బెనెల్లీ..దేశీయ మార్కెట్లోకి రూ.4.98 లక్షల విలువైన 502సీ క్రూజర్ బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బైకు ముందస్తు బుకింగ్‌లు ఆరంభించిన సంస్థ..కొనుగోలు చేసిన వారికి వచ్చే నెల మొదటి వారంలో అందచేయనున్నట్లు ప్రకటించింది. 500 సీసీ ఇంజిన్ కలిగిన ఈ బైకు 47.5 పీఎస్‌ల శక్తినివ్వనున్నది.