హైదరాబాద్‌లో పోకర్ణ ప్లాంట్

- రూ.500 కోట్లతో ఏర్పాటు
- నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ):క్వాంట్రా క్వార్జ్ బ్రాండ్ పేరుతో ప్రీమియం క్వార్జ్ సర్ఫేసెస్ తయారీలో దేశంలో అతిపెద్ద సంస్థ అయిన పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ హైదరాబాద్‌లో కొత్త ప్లాంటు ఏర్పాటు చేసింది. అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఈ అత్యాధునిక కేంద్రం కోసం కంపెనీ రూ. 500 కోట్ల పెట్టుబడులు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ యూనిట్‌ను శనివారం (జూలై 31)న ప్రారంభించనున్నారు. భాగ్యనగరంలోని మేకగూడ వద్ద 1,60,000 చ.మీ విస్తీర్ణంలో 90లక్షల చదరపు అడుగుల వార్షిక తయారీ సామర్థ్యంతో దీన్ని స్థాపించారు. ఈ తయారీ కేంద్రం ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ ఏడాది మార్చి 24న ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త కేంద్రం ప్రారంభంతో సంస్థ మొత్తం వార్షిక సామర్థ్యం 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంటుందని సీఈవో పరాస్ కుమార్ జైన్ వెల్లడించారు. పూర్తి సామర్థ్యానికి చేరుకున్న తర్వాత ఈ కేంద్రం నుంచి రూ. 400 కోట్ల టర్నోవర్ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | అభిజీత్ దీప్కే నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు.. ర్యాలీకి వెళ్లకూడదంటూ నోటీసులు జారీ
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

