21 ఏండ్లలో ఫస్ట్ టైం:కార్పొరేట్ల కంటే సామాన్యులే బెస్ట్!
21 ఏండ్లలో ఫస్ట్ టైం:కార్పొరేట్ల కంటే సామాన్యులే బెస్ట్! | 2020-21)లో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ప్రతికూల రికార్డు నమోదైంది. కార్పొరేట్ ...

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2020-21) అంతా కరోనా మహమ్మారి నీలి నీడలోనే సాగింది.. వేల మంది ఉద్యోగాలు కోల్పోయి అల్లాడితే.. కొందరు కార్పొరేట్ల వ్యక్తిగత సంపద రూ. కోట్లలో పెరిగింది. కానీ గతేడాది పన్ను చెల్లింపుల్లో సగటు భారతీయుడే పై చేయి సాధించాడు.
ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ప్రతికూల రికార్డు
గతేడాది (2020-21)లో ప్రత్యక్ష పన్ను వసూళ్లలో ప్రతికూల రికార్డు నమోదైంది. కార్పొరేట్ కంపెనీల.. కార్పొరేట్ టాక్స్ కంటే సాధారణ వ్యక్తులు.. వేతన జీవులు చెల్లించే ఆదాయం పన్ను ఎక్కువ. ఇది గత 21 ఏండ్లలో తొలిసారి అని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
కార్పొరేట్ టాక్స్ వసూళ్లు రూ.4.57 లక్షల కోట్లు
ఐటీ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గతేడాది ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.9.45 లక్షల కోట్లు. ఇందులో కార్పొరేట్ టాక్స్ వసూళ్లు రూ.4.57 లక్షల కోట్లు. వ్యక్తిగత ఆదాయం పన్ను వసూళ్లు రూ.4.69 లక్షల కోట్లు. ఇతర పన్ను రూ.16,927 కోట్లు.

2000-01లో ప్రత్యక్ష పన్ను వసూళ్లెంతంటే..
2000-01 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రత్యక్ష పన్నులన్నీ కలిపి రూ.68,305 కోట్లు మాత్రమే. ఇందులో కార్పొరేట్ టాక్స్ వసూళ్లు రూ.35,696 కోట్లు ఉంటే, వేతన జీవుల ఐటీ రిటర్న్స్ రూ.31,764 కోట్లు మాత్రమే. 2003-04లో ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.లక్ష కోట్ల మార్క్‌ను దాటి రూ.1.05 లక్షల కోట్లకు చేరుకుంది.
వసూళ్లు ఎందుకు తగ్గాయంటే..
పెట్టుబడిదారులను ప్రోత్సహించడానికి 2019 సెప్టెంబర్‌లో నరేంద్రమోదీ సర్కార్ కార్పొరేట్ టాక్స్ తగ్గించి వేసింది. అంతకుముందు 25 శాతంగా ఉన్న కార్పొరేట్ టాక్స్ 10 శాతానికి కుదించారు.
నూతన కంపెనీలపై పన్ను రేటు 17 శాతానికి తగ్గించారు. ఇక వ్యక్తిగత ఆదాయం పన్ను (ఐటీ) మినహాయింపులు రూ. 5 లక్షల వరకు పెంచారు. ఐటీ మినహాయింపుల వల్ల రూ.23,200 కోట్ల ఆదాయం తగ్గింది.
ఇవి కూడా చదవండి:
ఇంటి పెద్దను కోల్పోతే రుణ చెల్లింపులు ఎలా..?
ముకేశ్ అంబానీ గతేడాది జీతం సున్నా.. ఎందుకో తెలుసా?
ఈకో ఫ్రెండ్లీ ఫ్యూయల్ : 2023 ఏప్రిల్ నుంచి ఇథనాల్ పెట్రోల్
టాప్ గెయినర్స్ జాబితాలో టైటాన్ , అదానీ పోర్ట్స్…
2.27 కోట్లు.. ఏప్రిల్, మే నెలల్లో కోల్పోయిన ఉద్యోగాలు
లక్షమందికి ఉచిత వ్యాక్సిన్లు: మలబార్
రికార్డు గరిష్టానికి స్టాక్ మార్కెట్లు
ఇప్పుడు కొన్నా.. 3 నెలలకు ఈఎంఐ షురూ.. మహీంద్రా ఆఫర్ !
బిట్ కాయిన్ ముందు ఐదు సవాళ్లు.. అవేంటంటే?!
రెండేళ్ల చిన్నారి..205 దేశాల రాజధానుల పేర్లు చెప్పేస్తోంది.. వీడియో
ఇజ్రాయెల్‌లో అధికార మార్పు: ప్రధానమంత్రిగా బెన్నెట్
నెట్ ఫ్లిక్స్ లో తాప్సీ సినిమా
Poco M3 Pro: పొకో నుంచి వస్తోన్న తొలి 5G ఫోన్ ఇదే..!
మహేష్ ముందడుగు.. అభిమానులలో ఉత్సాహం
COVID Diet : కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ డైట్ ఫాలో అవ్వండి
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bank Jobs | ఎగ్జిమ్ బ్యాంక్‌లో 120 ఖాళీలు.. నవంబర్ 27 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Chiranjeevi Megaverse | చిరంజీవి పేరులో ‘N’ మాయం వెనుక అసలు కథ ఇదే.. ‘మెగావర్స్’ టీజర్ వచ్చేసింది!
Road Accident | భోగాపురం హైవేపై ఘోర ప్రమాదం.. ట్యాంకర్‌ను ఢీకొన్న థార్, ఐదుగురు మృతి
Prostate Cancer | ప్రోస్టేట్ క్యాన్సర్ గుర్తింపు, చికిత్సకు కొత్త మార్గదర్శకాలు.. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ఏం చెప్పింది..?
Sreejith Ravi | పోక్సో కేసులో మలయాళ నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష.. త్రిసూర్ కోర్టు సంచలన తీర్పు!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

