e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News ఎంపిక చేసిన హోండా 77,954 కార్ల రీకాల్‌

ఎంపిక చేసిన హోండా 77,954 కార్ల రీకాల్‌

ఎంపిక చేసిన హోండా 77,954 కార్ల రీకాల్‌

న్యూఢిల్లీ: ప్ర‌ముఖ కార్ల త‌యారీ సంస్థ హోండా కార్స్ ఇండియా వివిధ మోడ‌ల్ కార్లు 77,954 యూనిట్ల‌ను రీ కాల్ చేస్తున్న‌ట్లు శుక్ర‌వారం ప్ర‌క‌టించింది. ఫాల్ట్ ఫ్యూయ‌ల్ పెట్రోల్ పంపుల‌ను రీప్లేస్ చేయ‌డానికి ఈ క‌స‌ర‌త్తు చేప‌ట్టిన‌ట్లు తెలిపింది. స్టార్ట్ కాని, ఇంజిన్లు నిలిచిపోయిన కార్ల‌లో ఫ్యూయ‌ల్ పంపుల‌ను ఇన్‌స్టాల్ చేస్తామ‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

అమేజ్‌, ఫోర్త్ జ‌న‌రేష‌న్ సిటీ, డ‌బ్ల్యూఆర్‌-వీ, జాజ్‌, సివిక్‌, బీఆర్‌-వీ, సీఆర్వీ మోడ‌ల్ కార్ల‌ను రీ కాల్ చేసిన‌ట్లు వెల్ల‌డించింది. 2019 జ‌న‌వ‌రి- 2019 సెప్టెంబ‌ర్ మ‌ధ్య త‌యారైన కార్ల‌ను రీ కాల్ చేసింది.

2019 జ‌న‌వ‌రి- ఆగ‌స్టు మ‌ధ్య ఉత్ప‌త్త‌యిన 36,086 యూనిట్ల అమేజ్‌, 2019 జ‌న‌వ‌రి-సెప్టెంబ‌ర్ మ‌ధ్య త‌యారైన 20,248 యూనిట్ల ఫోర్త్ జ‌న‌రేష‌న్ సిటీ కార్లు రీకాల్ చేస్తున్న‌ది.

అలాగే 2019 జ‌న‌వ‌రి- ఆగ‌స్టు మ‌ధ్య నిర్మించిన 7,871 డ‌బ్ల్యూఆర్‌-వీ యూనిట్లు, 6,235 యూనిట్ల జాజ్ మోడ‌ల్ కార్లు కూడా రీకాల్ చేసిన వాటిల్లో ఉన్నాయి.

2019 జ‌న‌వ‌రి-సెప్టెంబ‌ర్ మ‌ధ్య ఉత్ప‌త్తైన 5,170 యూనిట్లు సివిక్‌, 2019 జ‌న‌వ‌రి-అక్టోబ‌ర్ మ‌ధ్య త‌యారైన 1737 యూనిట్లు బీఆర్‌వీ, 2019 జ‌న‌వ‌రి- 2020 సెప్టెంబ‌ర్ మ‌ధ్య మాన్యూఫాక్చ‌రైన 607 యూనిట్ల సీఆర్వీ మోడ‌ల్ కార్ల‌ను రీకాల్ చేసింది.

దేశ‌వ్యాప్తంగా అన్ని డీల‌ర్‌షిప్‌ల వ‌ద్ద ఉచితంగా ఈ కార్ల‌లో ద‌శ‌ల‌వారీగా ఫ్యూయ‌ల్ పంపుల‌ను రీప్లేస్‌మెంట్ చేస్తామ‌ని హోండా కార్స్ ఇండియా తెలిపింది. ఈ నెల 17వ తేదీ నుంచి కార్ల రీప్లేస్‌మెంట్ ప్రారంభం అవుతుంద‌న్న‌ది.

గ‌తేడాది జూన్‌లో కూడా అమేజ్‌, సిటీ, జాజ్ స‌హా ప‌లు మోడ‌ల్ 65,651 యూనిట్ల‌ను రీకాల్ చేస్తున్న‌ట్లు హోండా కార్స్ ఇండియా తెలిపింది. 2018లో త‌యారైన ఫాల్టీ ఫ్యూయ‌ల్ పంప్స్ రీ ప్లేస్ చేసింది.

ఇవి కూడా చదవండి..

ఈనెల 30 వ‌ర‌కు గురుకుల‌సెట్‌ దర‌ఖాస్తులు
నీట్‌-2021వాయిదా

కుంభమేళాలో 5 రోజుల్లో 1700 మందికి కరోనా

చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలను మూసివేసిన ఏఎస్‌ఐ

రాజస్థాన్‌లో నేటి నుంచి వారాంతపు నైట్‌ కర్ఫ్యూ

ఢిల్లీపై కరోనా పంజా.. ఒకే బెడ్‌పై ఇద్దరు..

ఏడాదిలో మూడో టీకా అవసరం : ఫైజర్‌ సీఈఓ

తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సూర్జేవాలా, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌కు కరోనా
దేశంలో కరోనా విలయం.. 24 గంటల్లో 2లక్షలకుపైగా కేసులు.. 1,185 మంది మృతి

కరోనా సెకండ్‌ వేవ్‌ను అధిగమించడం పెద్ద సవాలే : కేంద్రమంత్రి

దేశంలోకి త్వరలో కొత్తగా 8 బ్యాంకులు

చౌక వ‌డ్డీకే బంగారం లోన్‌.. ఈ బ్యాంకుల్లోనే..!

Advertisement
ఎంపిక చేసిన హోండా 77,954 కార్ల రీకాల్‌
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement