Gold Rates | కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతూ రాకెట్ వేగంతో దూసుకెళ్తున్న పసిడి ధరలకు (Gold Rates) కాస్త బ్రేక్ పడింది. నేడు ధనత్రయోదశి (Dhanteras) సందర్భంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తులంపై రూ.1,900 తగ్గింది. దీంతో పలు నగరాల్లో బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి.
శనివారం ఉదయం హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,910 తగ్గి రూ.1,30,860కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పతనమై రూ.1,19,950గా ఉంది. అటు వెండి (silver) కూడా భారీగా పతనమైంది. ఒక్కరోజే కేజీపై ఏకంగా రూ.13వేలు తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,90,000గా ఉంది.
ధంతేరస్ను ధనలక్ష్మిని ఆరాధించే పవిత్రమైన రోజుగా అభివర్ణిస్తారు. భక్తుల కోరికలను తీర్చడానికి ‘అదృష్ట లక్ష్మి’ తనను పూజించే ప్రతి ఇంటికీ ఈ రోజు అతిథిగా విచ్చేస్తుందన్నది ఒక నమ్మకం. అందుకే ఈ పండుగ రోజు బంగారం, వెండి వంటి వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదమని ప్రజల విశ్వాసం. ఈ క్రమంలో నేడు బంగారం ధరలు తగ్గడంతో ప్రజల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు మార్కెట్లో బంగారం కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
Also Read..
Chicken Masala | దివాళీ గిఫ్ట్‌గా.. చికెన్ మసాలా ప్యాకెట్ అందుకున్న ఆలయ ఉద్యోగులు
Air Pollution | ఢిల్లీలో అధ్వాన స్థితికి వాయు కాలుష్యం
Fire | గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం