Fire | గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం
Fire | దీపావళి పండుగ వేళ దేశంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పంజాబ్ (Punjab) రాష్ట్రంలో ఓ రైలులో భారీగా మంటలు చెలరేగాయి.
Fire | దీపావళి పండుగ వేళ దేశంలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. పంజాబ్ (Punjab) రాష్ట్రంలో గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు చెలరేగాయి. లూథియానా నుంచి ఢిల్లీకి వెళ్తున్న అమృత్సర్-సహర్సా ఎక్స్‌ప్రెస్ రైలు (Amritsar-Saharsa Express Train)లో మంటలు వ్యాపించాయి. ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.
రైలు సిర్హింద్ స్టేషన్ (Sirhind Station) దాటిన వెంటనే కోచ్ నంబర్ 19 నుండి పొగలు రావడం మొదలయ్యాయి. అప్రమత్తమైన ప్రయాణికులు (passengers) అధికారులకు సమాచారం అందించారు. కాసేపటికే మంటలు రైలు కోచ్ మొత్తం వ్యాపించాయి. పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది, GRP, RPF, పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఓ ప్రయాణికురాలికి గాయాలైనట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. రైల్లో మంటలు ఎగసిపడుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
VIDEO | Sirhind, Punjab: A major train accident was averted near Sirhind railway station when a fire broke out in the Garib Rath Express travelling from Amritsar to Saharsa, just half a kilometre ahead of Ambala. The train was halted immediately after smoke was seen billowing… pic.twitter.com/vXwHoqTEJB
— Press Trust of India (@PTI_News) October 18, 2025
Also Read..
Yusuf Pathan: మసీదుకెళ్లిన యూసుఫ్ పఠాన్.. అది ఆదినాథ్ ఆలయమన్న బీజేపీ
చిన్నారులపై కీచక పర్వం!.. దేశంలో గత ఐదేండ్లలో 94 శాతం పెరిగిన లైంగిక నేరాలు
త్రిపురలో ముగ్గురు బంగ్లా స్మగ్లర్ల మృతి.. భారత్, బంగ్లా మధ్య రాజుకున్న దౌత్య వివాదం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

