కోల్కతా:తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్(Yusuf Pathan) ఇటీవల పశ్చిమ బెంగాల్లో ఉన్న ఓ ప్రాచీన మసీదుకు వెళ్లారు. మాల్దాలో ఉన్న అదినా మసీదుకు వెళ్లినట్లు ఆయన తన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఇదో చరిత్రాత్మక మసీదు అని, దీన్ని 14వ శతాబ్ధంలో సుల్తాన్ సికందర్ షా నిర్మించినట్లు చెప్పారు. ఇలియాస్ షాహి పాలకులకు చెందిన రెండో చక్రవర్తి అన్నారు. 1373 నుంచి 1375 మధ్యలో దీన్ని నిర్మించినట్లు చెప్పారు.
ఆ రోజుల్లో భారత్లో నిర్మించిన అతిపెద్ద మసీదు అన్నారు. ఈ మసీదులో ఆర్కిటెక్చర్ గొప్పతనం తెలుస్తుందన్నారు. ఆర్కియాలజీ మాన్యుమెంట్ వద్ద దిగిన ఫోటోలను యూసుఫ్ పఠాన్ పోస్టు చేశారు. సోషల్ మీడియాలో దీనిపై యూజర్స్ కామెంట్స్ పోస్టు చేశారు. ఓ ఆలయంపై ఆ మసీదును నిర్మించినట్లు ఆరోపించారు. తృణమూల్ ఎంపీ పోస్టుకు ఆ రాష్ట్ర బీజేపీ శాఖ కూడా స్పందించింది. అది ఆదినాథ్ ఆలయం అని పేర్కొన్నది.
గత ఏడాది ఆ మసీదులో హిందూ పూజారులు అక్కడ ప్రార్థనలు చేశారు. మసీదు ప్రాంతంలో హిందువుల దేవతా విగ్రహాలు ఉన్నట్లు వృందావన్కు చెందిన విశ్వవిద్యా ట్రస్టు గుర్తించింది. ఆ ట్రస్టు అధ్యక్షుడు గోస్వామి ఇతర పూజారులతో కలిసి అక్కడ పూజలు చేశారు. అయితే ఆ తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆయనపై కేసు నమోదు చేసింది.
Correction: Adinath Temple ✅ https://t.co/mjFzqO7gnP
— BJP West Bengal (@BJP4Bengal) October 17, 2025