త్రిపురలో ముగ్గురు బంగ్లా స్మగ్లర్ల మృతి.. భారత్, బంగ్లా మధ్య రాజుకున్న దౌత్య వివాదం
త్రిపురలో ఓ గ్రామస్థుడిని చంపిన ముగ్గురు బంగ్లాదేశీ స్మగ్లర్లను గ్రామస్థులు హతమార్చారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
న్యూఢిల్లీ: త్రిపురలో ఓ గ్రామస్థుడిని చంపిన ముగ్గురు బంగ్లాదేశీ స్మగ్లర్లను గ్రామస్థులు హతమార్చారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. అక్టోబర్ 15న జరిగిన ఈ ఘటన భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య వివాదానికి దారితీసింది. హత్యకు గురైన ముగ్గురు బంగ్లాదేశీయులకు న్యాయం జరగాలని, దీనిపై తక్షణమే నిష్పాక్షిక, పారదర్శక దర్యాప్తు జరగాలని బంగ్లాదేశ్ డిమాండు చేసింది. దీన్ని మానవ హక్కుల ఉల్లంఘనగా ఆరోపించింది.
బంగ్లాదేశ్ ఆరోపణలను తోసిపుచ్చిన విదేశీ వ్యవహారాల శాఖ భారత భూభాగంలో మూడు కిలోమీటర్ల లోపల ఈ ఘటన జరిగినట్లు ప్రకటించింది. బిద్యాబిల్ గ్రామంలో పశువులను దొంగలించడానికి బంగ్లాదేశీ స్మగ్లర్లు ప్రయత్నించినట్లు కేంద్రం తెలిపింది. దీన్ని చూసిన స్థానికులు స్మగ్లర్లను ఎదుర్కొనడానికి ప్రయత్నించారని, పదునైన ఆయుధాలతో దాడి చేసిన స్మగర్లపై ఆత్మరక్షణార్థం గ్రామస్థులు ఎదురుదాడి చేశారని ప్రభుత్వం పేర్కొంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donadl Trump: రష్యాతో లింకున్న ఆంక్షలను ఎత్తివేసిన ట్రంప్.. భారత్కు భారీ ఊరట
Japan | జపాన్లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
Mahabubnagar | యువకుల కార్ల రేసింగ్ సరదా.. మహిళ ప్రాణం బలి!
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

