Chicken Masala | దేశ వ్యాప్తంగా దీపావళి సందడి మొదలైంది. ఇక ఫెస్టివల్ సందర్భంగా ఉద్యోగులు పలు రకాల బహుమతులను అందుకుంటున్నారు. కొన్ని సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్‌లు, స్వీట్లు, ట్రాలీలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు ఇచ్చి సంతోషపరుస్తున్నాయి. మరికొన్ని ప్రధాన కంపెనీలు ఓ అడుగు ముందుకేసి తమ సిబ్బందికి లగ్జరీ కార్లు, బైక్‌లు, బంగారు ఆభరణాలు, అపార్ట్‌మెంట్స్‌ను బహుమతిగా అందిస్తున్నాయి.
అయితే, మహారాష్ట్ర (Maharashtra)లోని ఓ ఆలయంలో పనిచేసే ఉద్యోగులు (Temple Employees) అసాధారణమైన దీపావళి బహుమతిని అందుకున్నారు. పంధర్పూర్లోని ప్రఖ్యాత విఠల్ ఆలయంలో పనిచేసే ఉద్యోగులకు అధికారులు దివాళీ గిఫ్ట్‌గా చికెన్ మసాలా (Chicken Masala) ప్యాకెట్లను అందించారు. సెక్యూరిటీ గార్డ్స్, ఇతర ఉద్యోగులతో సహా అవుట్సోర్సింగ్ సిబ్బందికి వీటిని అందించారు. అయితే, ఆలయ ఉద్యోగులకు చికెన్ మసాలా ప్యాకెట్లు ఇవ్వడం స్థానికంగా చర్చకు దారితీసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది.
Also Read..
Air Pollution | ఢిల్లీలో అధ్వాన స్థితికి వాయు కాలుష్యం
Fire | గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌లో భారీగా మంటలు.. తప్పిన పెను ప్రమాదం
చిన్నారులపై కీచక పర్వం!.. దేశంలో గత ఐదేండ్లలో 94 శాతం పెరిగిన లైంగిక నేరాలు