e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News ఈపీఎఫ్‌వో రిలీఫ్‌.. స‌భ్యుల‌కు రెండో కోవిడ్ అడ్వాన్స్‌!

ఈపీఎఫ్‌వో రిలీఫ్‌.. స‌భ్యుల‌కు రెండో కోవిడ్ అడ్వాన్స్‌!

ఈపీఎఫ్‌వో రిలీఫ్‌.. స‌భ్యుల‌కు రెండో కోవిడ్ అడ్వాన్స్‌!

న్యూఢిల్లీ: ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) స‌భ్యుల‌కు గొప్ప రిలీఫ్‌. క‌రోనా వేళ త‌న స‌బ్‌స్క్రైబ‌ర్ల‌కు మ‌ద్ద‌తుగా నిలిచేందుకు ముందుకు వ‌చ్చింది. స‌బ్‌స్క్రైబ‌ర్లు త‌మ ఈపీఎఫ్ డిపాజిట్ల నుంచి మ‌రో ద‌ఫా నాన్‌-రీఫండ‌బుల్ అడ్వాన్స్ తీసుకునేందుకు అనుమ‌తినిచ్చింది. ఆదివారం జ‌రిగిన ఈపీఎఫ్‌వో గ‌వ‌ర్నింగ్ బాడీ స‌మావేశం ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.

ప్ర‌ధాన‌మంత్రి గ‌రీబ్ క‌ల్యాణ్ యోజ‌నా (పీఎంజీకేవై) కింద గ‌తేడాది మార్చిలో క‌రోనా మ‌హ‌మ్మారి వేళ‌.. ఆర్థిక అవ‌స‌రాల‌ను తీర్చేందుకు ఈపీఎఫ్ డిపాజిట్ల నుంచి ప్ర‌త్యేక విత్‌డ్రాయ‌ల్స్‌కు నిబంధ‌న జ‌త చేసింది.

ఈ నిబంధ‌న కింద త‌మ స‌బ్‌స్క్రైబ‌ర్ల మూడు నెల‌ల క‌నీస వేత‌నం ప్ల‌స్ క‌రువు భ‌త్యం/ ఈపీఎఫ్ ఖాతాలో స‌భ్యుడి క్రెడిట్‌లో 75 శాతంల్లో ఏది త‌క్కువైతే దాన్ని విత్ డ్రా చేసుకోవ‌చ్చు.

ఈపీఎఫ్‌వో రిలీఫ్‌.. స‌భ్యుల‌కు రెండో కోవిడ్ అడ్వాన్స్‌!

నెల‌స‌రి వేత‌నం రూ.15 వేల లోపు ఉన్న ఈపీఎఫ్ స‌భ్యుల‌కు క‌రోనా మ‌హ‌మ్మారి వేళ కోవిడ్‌-19 అడ్వాన్స్ గొప్ప స‌హాయ‌కారిగా ఉంటుంది. ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్‌-19 అడ్వాన్స్ కోసం 76.31 ల‌క్ష‌ల క్లెయిమ్‌ల‌కు పైగా ఆమోదించింది. దీని కింద రూ.18,698.15 కోట్లు పంపిణీ చేసింది.

క‌రోనా మ‌హ‌మ్మారి సెకండ్ వేవ్‌తోపాటు బ్లాక్ ఫంగ‌స్‌ను అంటువ్యాధిగా కేంద్రం ప్ర‌క‌టించింది. క‌నుక త‌మ స‌భ్యులు తొలిద‌ఫా కోవిడ్‌-19 అడ్వాన్స్ మాదిరిగానే రెండో ద‌ఫా అడ్వాన్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఫ‌స్ట్ అడ్వాన్స్ టైంలో మాదిరే ఇప్పుడు విత్‌డ్రాయ‌ల్స్ కోసం ప్రాసెస్ చేసుకోవాలి.

ఇందుకోసం ఈపీఎఫ్‌వో ఆటో-క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ పేరిట ఒక వ్య‌వ‌స్థ‌ను రూపొందించింది. స‌భ్యులు కేవైసీ స‌మ‌ర్పించిన త‌ర్వాత క్లెయిమ్ సెటిల్మెంట్ ప్ర‌క్రియ మూడు రోజుల్లో పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించింది. మామూలుగా ఈ క్లెయిమ్‌ల‌ను ఆమోదించ‌డానికి 20 రోజులు ప‌డుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

రేప‌ట్నుంచి బ్యాంకుల ప‌ని వేళ‌ల్లో మార్పు

ఐటీ రూల్స్‌: ఫిర్యాదుల స్వీకరణకు సోష‌ల్ మీడియా ఏర్పాట్లు!

బంగారంపై భార‌త్‌లో మోజు త‌గ్గుతుందా..!?

చిన్న వ్యాపారుల‌కు రిలీఫ్‌.. ఎమ‌ర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ!

ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్‌సీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇలా..

కోవిడ్ మృతుల‌ కుటుంబాల‌కు ఈఎస్ఐ బెనిఫిట్లు ఇలా!

క‌రోనా వేళ క‌స్ట‌మ‌ర్ల‌కు ఎస్బీఐ రిలీఫ్‌.. అదేంటంటే!!

మోదీ స‌ర్కార్ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాలి : స‌చిన్ పైల‌ట్

జూన్ 20 త‌ర్వాత స్పుత్నిక్ వీ టీకాల‌ తొలి బ్యాచ్ రాక‌

5జీ నెట్‌వర్క్‌కు వ్య‌తిరేకంగా కోర్టుకెక్కిన బాలీవుడ్ న‌టి

రాజ‌ద్రోహానికి పరిమితుల‌ను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు

ఆర్థిక ఇబ్బందుల‌తో స‌ర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు

రెండు వేర్వేరు డోసులు తీసుకుంటే ఎలా ? వ్యాక్సిన్ మిక్సింగ్‌పై త్వ‌ర‌లో స్ట‌డీ

క‌రోనా చికిత్స: రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు అన్‌సెక్యూర్డ్ లోన్లు!

ఐసోలేషన్ కేంద్రంతో నిరుపేదలకు మేలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఈపీఎఫ్‌వో రిలీఫ్‌.. స‌భ్యుల‌కు రెండో కోవిడ్ అడ్వాన్స్‌!

ట్రెండింగ్‌

Advertisement