ఐటీ రూల్స్: ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ఏర్పాట్లు!
ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ఏర్పాట్లు!| సెర్చింజన్ గూగుల్‌తోపాటు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తదితర డిజిటల్ మీడియా సంస్థలు కేంద్ర ...

న్యూఢిల్లీ: సెర్చింజన్ గూగుల్‌తోపాటు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ తదితర డిజిటల్ మీడియా సంస్థలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఐటీ నిబంధనల అమలుకు సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం. ఖాతాదారులు, ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి గ్రీవెన్స్ ఆఫీసర్లను నియమించాయి.
ఇప్పటికే గ్రీవెన్స్ అధికారులను నియమించిన విషయాన్ని ట్విట్టర్ మినహా గూగుల్, ఫేస్బుక్, వాట్సాప్ తదితర సంస్థలు ప్రభుత్వంతో పంచుకొన్నాయి. ఈ నిబంధనలను పాటించడానికి ట్విటర్ ఇప్పటికీ సిద్ధంగా లేదని తెలుస్తున్నది..
ట్విట్టర్ ఇప్పటి వరకు ఎటువంటి సమాచారాన్ని ఐటీ మంత్రిత్వ శాఖకు వెల్లడించలేదు. కాకపోతే ఒక న్యాయవాదిని కాంటాక్ట్ పర్సన్‌గా పేర్కొంటూ అతని వివరాలను వెబ్సైట్లో ఉంచింది. ధర్మేంద్ర చతుర్ భారత్‌లో తమ తాత్కాలిక గ్రీవెన్స్ ఆఫీసర్ అని పేర్కొంది.
ఇక ఫేస్బుక్, వాట్సాప్ గ్రీవెన్స్ అధికారులను నియమించి ఆ సమాచారాన్ని సంస్థ వెబ్సైట్లలో అప్లోడ్ చేయనున్నాయి. ఇక గూగుల్‌లో ‘కాంటాక్ట్ హజ్’ అన్న ఫీచర్ వద్ద ‘జో గ్రిగర్’ అనే వ్యక్తి పేరు రిజిస్టర్ చేసింది. అతని అడ్రస్ అమెరికాలోని ‘మౌంటెయిన్ వ్యూ’గా చూపింది. యూట్యూబ్‌లో కూడా ఇలాంటి మార్పులే జరిగాయి.
భారత్‌లో సోషల్ మీడియా వేదికలు, వెబ్సైట్లు, ఓటీటీ వేదికలు అమలు చేయాల్సిన కొత్త నిబంధనలను కేంద్రం ఫిబ్రవరిలో ప్రకటించింది. వీటి ప్రకారం దేశంలోని సోషల్ మీడియా సంస్థలు తమ పేరు, అడ్రస్, అధికారుల వివరాలు తమ యాప్‌లు, వెబ్సైట్లలో స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.
నెటిజన్ల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడానికి దేశీయంగా అంతర్గత యంత్రాంగం ఏర్పాటు చేయాలి. నిర్దిష్ట గడువులోగా వాటిని పరిష్కరించాలి. అభ్యంతరకర కంటెంట్‌పై పర్యవేక్షణ, వాటి తొలగింపు… తదితర వివరాలు నెలకోసారి వెల్లడించాలి.
దేశ సార్వభౌమత్వం, రక్షణ తదితర కీలకాంశాలపై ఏదైనా సమాచారం, పోస్టింగులను పెడితే… వాటి మూలాలను సర్కార్‌కు ఇవ్వాలి. యూజర్ల సందేశాలను, వారి అకౌంట్లను సోషల్ మీడియా తొలగిస్తే వారికి తమ వాదన వినిపించుకోవటానికి టైం ఇవ్వాలి. సోషల్ మీడియాపై ఫిర్యాదులను కేంద్రంలోని ఉన్నత స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుంది.
ఇవి కూడా చదవండి:
అక్కెరకురాని ముచ్చట్లతో లాభం లేదు.. ప్రధాని మన్ కీ బాత్‌పై రాహుల్‌గాంధీ ఫైర్
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
ఈఎస్ఐసీ ద్వారా ఫ్యామిలీ పెన్షన్…
IPL 2021: ఐపీఎల్ కోసం సీపీఎల్ షెడ్యూల్ మార్పు
మార్స్‌పై మేఘాలను చూశారా.. క్యూరియాసిటీ పంపిన అద్భుతమైన ఫొటోలు
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
మళ్లీ రాజకీయాల్లోకి వస్తా.. పార్టీని గాడిలో పెడతా!
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
పీపీఈ కిట్ వేసుకొని.. కొవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నదిలో పడేస్తూ.. షాకింగ్ వీడియో
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

