న్యూఢిల్లీ: ఇప్పటికీ గ్యారంటీ రిటర్న్స్ ఆఫర్ చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన డెట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ).
ఆ జాబితాలో దేశంలోకెల్లా అతిపెద్ద ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంకు.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ)తోపాటు యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి.
భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిర్ణయించిన ద్రవ్య పరపతి విధానం.. రెపోరేట్, బేస్ రేట్, బ్యాంకుల్లో అంతర్గత ద్రవ్య లభ్యత, క్రెడిట్ డిమాండ్ స్థాయికి అనుగుణంగా ఫిక్స్డ్ డిపాజిట్ల రేట్లు ఖరావుతాయి.
ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల టెన్యూర్ వరకు ఈ బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆకర్షణీయ బెనిఫిట్లు ఆఫర్ చేస్తున్నాయి. కనుక వివిధ బ్యాంకులు ఆఫర్ చేస్తున్న బెనిఫిట్ల గురించి తెలుసుకుందాం..
ఇలా ఎస్బీఐ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు
ఎస్బీఐలో రూ.2 కోట్ల లోపు మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ) నిర్దిష్ట గడువుకు అనుగుణంగా వడ్డీరేటు ఖరారవుతుంది. ఏడు రోజుల నుంచి 45 రోజుల గడువు ఫిక్స్డ్ డిపాజిట్లకు 2.9% వడ్డీ ఇస్తుంది.
46 రోజులు-179 రోజుల మధ్య చేసే టర్మ్ డిపాజిట్లపై 3.9%, 180 రోజుల నుంచి ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.4% వడ్డీ లభిస్తుంది.
3-5 ఏండ్ల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.3%, 5-10 ఏండ్ల మధ్య టర్మ్ డిపాజిట్లపై 5.4% వడ్డీ అందిస్తుందీ ఎస్బీఐ. వృద్ధులకు అదనంగా 50 బేసిక్ పాయింట్ల వడ్డీ ఇస్తుంది.
ఎస్బీఐ ఆఫర్ చేసే వడ్డీరేట్లు 7 రోజుల నుంచి 45 రోజుల వరకు – 2.9%, 46 రోజుల నుంచి 179 రోజుల వరకు – 3.9% ఆఫర్ చేస్తున్నది. 180 రోజుల నుంచి 210 రోజుల వరకు – 4.4%, 211 రోజుల నుంచి ఏడాది లోపు – 4.4% ఇస్తున్నది.
ఏడాది నుంచి రెండేండ్లలోపు- 5%, రెండేండ్ల నుంచి మూడేండ్లలోపు – 5.1%, 3 ఏండ్ల నుంచి 5 ఏండ్లలోపు – 5.3% ఐదేండ్ల నుంచి 10 ఏండ్ల వరకు- 5.4% వడ్డీ ఇస్తుంది.
2 ఏండ్ల నుంచి 3 ఏండ్ల వరకు – 5.1%, 3 ఏండ్ల నుంచి ఐదేండ్లలోపు – 5.3% వడ్డీ లభిస్తుంది. 5 ఏండ్ల నుంచి 10 ఏండ్ల వరకు- 5.4% వడ్డీ పొందొచ్చు.
హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఇలా..
రూ.2 కోట్ల లోపు పదేండ్ల టెన్యూర్‌తో చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై గరిష్ఠంగా 5.5 శాతం వడ్డీరేటు అందజేస్తున్నది. 7-14 రోజుల మధ్య ఫిక్స్డ్ డిపాజిట్లపై కనిష్ఠంగా 2.5 శాతం వడ్డీ ఇస్తుంది.
7- 14 రోజులు- 3.00% , 15 – 29 రోజులు- 3.00%, 30 – 45 రోజులు – 3.50% వడ్డీ లభిస్తుంది. ఇక 46 – 60 రోజులు – 3.50%, 61 – 90 రోజులు – 3.50%, 91 రోజులు – 6 నెలలు – 4.00%, 181 రోజులు – 9 నెలలు – 4.90% శాతం అందుకోవచ్చు.
211 రోజులు- ఏడాది లోపు – 4.90%, ఏడాది గడువు – 5.40% వడ్డీ పొందొచ్చు. ఏడాది నుంచి రెండేండ్లలోపు- 5.40%, రెండేండ్ల నుంచి మూడేండ్ల వరకు- 5.65%, 3 ఏండ్ల నుంచి 5 ఏండ్ల వరకు- 5.80%, 5 ఏండ్ల నుంచి 10 ఏండ్లు- 6.25% వడ్డీ తీసుకొచ్చు.
యాక్సిస్ బ్యాంకులో ఇలా ఎఫ్డీ రేట్లు
ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్లపై 7 రోజుల గడువు నుంచి 10 ఏండ్ల గడువు వరకు వివిధ శ్రేణుల్లో వడ్డీరేట్లు అందిస్తున్నది. ఈ ఏడాది జనవరి 4 నుంచి వడ్డీరేట్లు సవరించారు.
సాధారణ కస్టమర్లకు 2.5% నుంచి 5.50% వరకు వడ్డీరేట్లు ఖరారు చేసింది. సీనియర్ సిటిజన్లు ఎంపిక చేసిన మెచ్యూరిటీలపై అధిక వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది.
7 రోజుల నుంచి 29 రోజుల వరకు: 2.50%, 30 రోజుల నుంచి 3 నెలల వరకు: 3%, 3 నెలల నుంచి 6 నెలల వరకు: 3.5%, 6 నెలల నుంచి ఏడాది వరకు: 4.40% వడ్డీ ఇస్తున్నది. ఏడాది నుంచి 370 రోజుల వరకు: 5.10%, 370 రోజుల నుంచి 381 రోజుల వరకు: 5.15% వడ్డీ లభిస్తుంది.
381 రోజుల నుంచి 15 నెలల వరకు: 5.10%, 15 నెలల నుంచి 16 నెలల నుంచి 18 నెలల వరకు: 5.20%,
18 నెలల నుంచి రెండేండ్ల వరకు:5.25% వడ్డీ ఇస్తున్నారు. రెండేండ్ల నుంచి ఐదేండ్ల వరకు: 5.40%,
ఐదేండ్ల నుంచి 10 ఏండ్ల వరకు : 5.75% వడ్డీ అందిస్తున్నది.
ఇలా ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ వివిధ శ్రేణుల ఫిక్స్డ్ డిపాజిట్లపై విభిన్న వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నది. షార్ట్ టర్మ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడు రోజుల నుంచి ఏడాది వరకు, ఏడాది నుంచి పదేండ్లలోపు దీర్ఘకాలిక ఫిక్స్డ్ డిపాజిట్లపై వేర్వేరు వడ్డీలు ఖరారు చేసింది.
2.75 నుంచి 6 శాతం వడ్డీరేట్లు అందిస్తున్నది. ఈ వడ్డీరేట్లు 2021 మే ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.
7 – 14 రోజులు: 2.75%, 15 – 29 రోజులు: 3%, 30 – 45 రోజులు: 3.5%, 46 – 90 రోజులు: 4%, 91 – 180 రోజులు: 4.5% వడ్డీ అందుకోవచ్చు. 181 రోజుల నుంచి ఏడాది లోపు:5.25%, ఏడాది నుంచి రెండేండ్లు: 5.5%, రెండేండ్ల నుంచి మూడేండ్లు:5.75% వడ్డీ పొందుతారు.
3 ఏండ్ల నుంచి ఐదేండ్లు:6.00%, ఐదేండ్ల నుంచి 10 ఏండ్లు:5.75% శాతం వడ్డీ అందుతుంది. ఐదేండ్లు (పన్ను మినహాయింపు): 5.75% వడ్డీ ఆఫర్ చేస్తున్నది
కోటక్ మహీంద్రాలో 10 ఏండ్ల వరకు ఇలా
ప్రముఖ ప్రైవేట్ బ్యాంకర్ ఏడు రోజుల నుంచి 10 ఏండ్ల వరకు టెన్యూర్ గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 2.5 నుంచి 5.3 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి ఈ వడ్డీరేట్లు అమలులోకి వచ్చాయి.
7 – 30 రోజులు: 2.50%, 31 – 90 రోజులు: 2.75%, 91 – 120 రోజులు: 3.00%, 121 – 179 రోజులు 3.25%, 180 రోజుల నుంచి 364 రోజులు: 4.40% వడ్డీ లభిస్తుంది. 365 రోజుల నుంచి 389 రోజులు: 4.50%, 390 రోజులు (12 నెలల 25 రోజులు): 4.80%, 391 రోజులు: 4.80% వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
23 నెలల నుంచి 3 ఏండ్ల లోపు 5.00% వడ్డీ అందిస్తున్నది. 3 ఏండ్ల నుంచి 4 ఏండ్ల లోపు 5.10%, 4 ఏండ్ల నుంచి 5 ఏండ్ల లోపు 5.25% వడ్డీ ఆఫర్ చేస్తున్నది. 5 ఏండ్ల నుంచి 10 ఏండ్ల లోపు 5.30% వడ్డీ లభిస్తుంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీరేట్లు ఇవే:
7 నుంచి 45 రోజులు – 3%, 46 నుంచి 90 రోజులు – 3.25%, 91 నుంచి 179 రోజులు – 4% వడ్డీ ఇస్తున్నది. 180 రోజుల నుంచి 270 రోజులు – 4.4%, 271 రోజుల నుంచి ఏడాది – 4.5% వడ్డీ లభిస్తుంది.
ఏడాది నుంచి 3 ఏండ్ల వరకు: 5.10%, మూడేండ్ల నుంచి 5 ఏండ్ల వరకు: 5.25% వడ్డీ లభిస్తుంది. 5 ఏండ్ల నుంచి 10 ఏండ్ల వరకు: 5.25% వడ్డీ అందిస్తున్నది.
అక్కెరకురాని ముచ్చట్లతో లాభం లేదు.. ప్రధాని మన్ కీ బాత్‌పై రాహుల్‌గాంధీ ఫైర్
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
ఈఎస్ఐసీ ద్వారా ఫ్యామిలీ పెన్షన్…
IPL 2021: ఐపీఎల్ కోసం సీపీఎల్ షెడ్యూల్ మార్పు
మార్స్‌పై మేఘాలను చూశారా.. క్యూరియాసిటీ పంపిన అద్భుతమైన ఫొటోలు
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
మళ్లీ రాజకీయాల్లోకి వస్తా.. పార్టీని గాడిలో పెడతా!
ప్రియుడితో కలిసి సొంతింట్లోనే యువతి దొంగతనం
బుల్లెట్ బైక్ కోసం వరుడి డిమాండ్.. ఊహించని షాక్ ఇచ్చిన వధువు
పీపీఈ కిట్ వేసుకొని.. కొవిడ్ పేషెంట్ మృతదేహాన్ని నదిలో పడేస్తూ.. షాకింగ్ వీడియో