RR vs SRH | ఎలిమినేటర్‌లో పిడుగల్లే విరుచుకుపడిన వైభవ్.. సన్‌రైజర్స్ ముందు కొండంత లక్ష్యం..!
RR vs SRH : ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(97) రికార్డులను బద్ధలు కొడుతూ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ కొండంత స్కోర్ చేసింది.
RR vs SRH : ఐపీఎల్ సంచలనం వైభవ్ సూర్యవంశీ(97) రికార్డులను బద్ధలు కొడుతూ ఆడిన తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఎలిమినేటర్‌లో రాజస్థాన్ రాయల్స్ కొండంత స్కోర్ చేసింది. ముల్లన్‌పూర్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ దళాన్ని వణికిస్తూ 16 బంతుల్లోనే అర్ధ శతకం బాదిన వైభవ్.. తృటిలో రికార్డు శతకాన్ని చేజార్చుకున్నాడు. అనంతరం ధ్రువ్ జురెల్(50) హాఫ్ సెంచరీతో రాణించగా 250 ప్లస్ కొట్టేలా కనిపించింది రాజస్థాన్. కానీ, డెత్ ఓవర్లలో 36 పరుగులే ఇచ్చిన హైదరాబాద్ ప్రత్యర్థిని 243కు కట్టడి చేసింది.
ఎలిమినేటర్‌లో టాస్ ఓడిన రాజస్థాన్ రాయల్స్‌కు అదిరే శుభారంభమిచ్చాడు వైభవ్ సూర్యవంశీ(97 : 29 బంతుల్లో 5 ఫోర్లు, 12 సిక్సర్లు). తన అమ్ములపొదిలోని షాట్లన్నీ ఆడుతూ సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ జట్టుకు భారీ స్కోరందించాడు. మ్యాచ్‌కు ముందు వైభవ్‌ను కట్టడి చేసేందుకు తమవద్ద ప్లాన్ ఏ, ప్లాన్ బీ.. ప్లాన్ సీ ఉన్నాయని చెప్పిన కమిన్స్ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 25 రన్స్ రాబాట్టాడు.
Every single person is on their feet as the 15-year-old walks off 🫡
Updates ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/mpT3LAIEp0
— IndianPremierLeague (@IPL) May 27, 2026
అదే ఊపులో ఇషాన్ మలింగను దంచేసి 16 బంతుల్లోనే మెరుపు అర్ధ శతకంతో పాటు ఒక సీజన్లో క్రిస్ గేల్ పేరిట ఉన్న 59 అత్యధిక సిక్సర్ల రికార్డును అధిగమించాడు వైభవ్. 27 బంతుల్లోనే 97కు చేరుకున్న అతడు మరో ఫోర్ లేదా సిక్సర్‌తో ఐపీపెల్లో వేగవంతమైన శతకం రికార్డు అందుకుంటాడనిపించింది. కానీ, 8వ ఓవర్లో హింగే తెలివిగా విసిరిన చివరి బంతిని ఆఫ్ సైడ్‌లో ఆడిన వైభవ్ అక్కడే కాచుకున్న స్మరణ్ చేతికి చిక్కాడు. దాంతో.. గేల్ నెలకల్పిన 30 బంతుల సెంచరీ రికార్డును దాటలేకపోయానని వైభవ్ మైదానం వీడేందుకు అయిష్టత చూపాడు.
జురెల్ దూకుడు
రాజస్థాన్ ఇన్నింగ్స్‌ను వైభవ్ క్రీజులో ఉన్నంత వరకు, అతడు ఔటయ్యాక.. రెండు భాగాలుగా చూడొచ్చు. ఎందుకుంటే ఈ టీనేజర్ ఔటయ్యాక యశస్వీ జైస్వాల్(29) తడబాటుతో స్కోర్ కాస్త నెమ్మదించింది. అయితే.. కమిన్స్ ఓవర్లో జురెల్(50) విధ్వంసంతో రాజస్థాన్ వేగం అందుకుంది. అర్ధ శతకం తర్వాత జురెల్ ఔటైనా రియాన్ పరాగ్(26) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో.. 15 ఓవర్లకు స్కోర్ రెండొందలు దాటింది.
6⃣th FIFTY of the season 👌
Dhruv Jurel goes back after a sparkling knock ✨
Updates ▶️ https://t.co/OBIYYIuhbt #TATAIPL | #Eliminator | #TheFinalLeap | #SRHvRR pic.twitter.com/yXxXL0QiXP
— IndianPremierLeague (@IPL) May 27, 2026
అర్ధ శతకం తర్వాత జురెల్ ఔటవ్వగా.. డెత్ ఓవర్లలో ఫెరీరా(12), జడేజా(12), ఆర్చర్(4) దంచలేకపోయారు. వైభవ్ ఊచకోతకు తొలుత భారీగా పరుగులు సమర్పించుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు చివరి ఐదు ఓవర్లలో 36 పరగులే ఇవ్వడంతో రాజస్థాన్ 243కే పరిమితమైంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

