Tammareddy Bharadwaja | నిహాల్, ప్రియాదేశ్ పాగ్, అర్జున్ సీహెచ్, కాజల్ తివారీ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం సందిగ్ధం (Sandigdham). తెర చేప ఫేం నవీన్ సంకరపు విలన్‌గా నటించాడు. ఈ చిత్రాన్ని మే 29న విడుదలచేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
ప్రమోషనల్ ఈవెంట్లో ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చిన్న సినిమాలను అందరూ ప్రోత్సహించాలన్నారు. ఈ మధ్య అసలు టైటిల్స్ ఎలా ఉంటున్నాయో అంతా చూస్తున్నాం.. ఈ సినిమాకు మాత్రం అచ్చమైన అచ్చ తెలుగులో టైటిల్ పెట్టారు. టీజర్, ట్రైలర్ గమనిస్తే సినిమా టీం ఎంతో కష్టపడి అడవుల్లో సందిగ్ధం సినిమా చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రమోషన్స్ పంథా మారింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు వచ్చింది. నాలాంటి వ్యక్తికి ఇన్‌స్ట్రాగ్రాం ఉండదు. మరి నాకు ఎలా తెలుస్తుంది. ఇలాంటి చిన్న సినిమాను అందరూ ముందుండి ప్రమోట్ చేయాలన్నారు. సినిమా ఆడుతుందో లేదో అనేది తర్వాత విషయమని అసలు సినిమా ఒకటి వస్తుందని అందరికీ తెలియజేయాలన్నారు.
డైరెక్టర్ పార్థసారిథి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ప్రతీ ఒక్క ఆర్టిస్టు అద్భుతంగా నటించారు. గౌతమ్ మంచి పాటలను అందించారు. చిన్న సినిమాలను తీయడం కంటే ప్రమోట్ చేయడం, రిలీజ్ చేయడం చాలా కష్టం. అందరూ ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుందన్నారు. ఈ మూవీని తీర్థ క్రియేషన్స్ బ్యానర్‌పై తిరువీధుల సంధ్య నిర్మిస్తున్నారు. పార్థసారథి కొమ్మోజు దర్శకత్వం వహిస్తున్నారు.