e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home News కోవిడ్ మృతుల‌ కుటుంబాల‌కు ఈఎస్ఐ బెనిఫిట్లు ఇలా!

కోవిడ్ మృతుల‌ కుటుంబాల‌కు ఈఎస్ఐ బెనిఫిట్లు ఇలా!

కోవిడ్ మృతుల‌ కుటుంబాల‌కు ఈఎస్ఐ బెనిఫిట్లు ఇలా!

న్యూఢిల్లీ: క‌రోనా వేళ కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర కార్మిక‌శాఖ అద‌న‌పు బెనిఫిట్లు క‌ల్పించింది. ఈఎస్ఐసీ, ఈపీఎఫ్ఓ ద్వారా ఈ బెనిఫిట్లు అందుబాటులోకి తెచ్చింది. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల మ‌ర‌ణాలు పెరుగుతున్న నేప‌థ్యంలో ఆయా కార్మికుల కుటుంబ స‌భ్యుల స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించుకోవ‌డానికి వెసులుబాటు తెచ్చింది.

యాజ‌మాన్యాల‌పై ఎటువంటి అద‌న‌పు భారం మోప‌కుండానే కార్మికుల‌కు సామాజిక భ‌ద్ర‌త విస్త‌రించాల‌ని భావిస్తున్న‌ది. ప్ర‌స్తుతం ఈఎస్ఐసీలో పేర్లు న‌మోదు చేసుకున్న కార్మికులు మ‌ధ్య‌లో ఏదైనా ప్ర‌మాదంలో మ‌ర‌ణిస్తే, విక‌లాంగులైతే భార్య‌/ జీవిత భాగ‌స్వామి/ వితంతు త‌ల్లికి స‌గ‌టున 90%వేత‌నం చెల్లిస్తారు.

భార్య‌కు, వితంతు త‌ల్లికి జీవితాంతం, పిల్ల‌ల‌కు 25 ఏండ్ల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు ఈ వేత‌నం అందుతుంది. బాలిక‌ల‌కు 25 ఏండ్ల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు అంటే వివాహం అయ్యే వ‌ర‌కు ఈ బెనిఫిట్ వ‌ర్తిస్తుంది.

క‌రోనా వ‌ల్ల మ‌ర‌ణించిన ఈఎస్ఐసీ స‌భ్యులు, వారి కుటుంబ స‌భ్యుల‌కు కూడా.. (ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన/ విక‌లాంగులైన వారికి మాదిరే) ఆర్థిక ప్ర‌యోజ‌నాలు స‌మ‌కూరుతాయి. అయితే, ఈఎస్ఐసీలో ఇన్సూర్ అయిన స‌భ్యులు త‌ప్ప‌నిస‌రిగా ఈ ప్ర‌యోజ‌నాల కోసం మూడు నెల‌ల్లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

అలాగే, ఈఎస్ఐసీ స‌భ్యులు మూడు నెల‌లు (78 రోజులు) వేత‌నాలు తీసుకోవ‌డంతోపాటు ఈఎస్ఐలో త‌మ కంట్రిబ్యూష‌న్ చేయాలి. ఈ స్కీమ్ 2020 మార్చి 24 నుంచి రెండేండ్ల పాటు అమ‌లులో ఉంటుంది.

ఈ స్కీం కింద క‌నీస స‌ర్వీసుకు గ్రాట్యూటీ తీసుకోవాల‌న్న నిబంధ‌న అమ‌లులోకి రాదు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ ఒక ఏడాదిలో 91 రోజులు విధుల‌కు హాజ‌రు కాకుంటే 70% వేత‌నం చెల్లిస్తారు.

కోవిడ్ మృతుల‌ కుటుంబాల‌కు ఈఎస్ఐ బెనిఫిట్లు ఇలా!

క‌రోనా కింద మ‌ర‌ణించిన కార్మికుల కుటుంబాల‌కు 90 శాతం వేత‌నం చెల్లించ‌డానికి నిబంధ‌న‌లు ఇవే:

మ‌రణించిన ఒక కార్మికుడి కుటుంబ స‌భ్యుల‌కు గ‌రిష్ఠంగా రూ.6-7 ల‌క్ష‌ల వ‌ర‌కు పెంచొచ్చు. క‌నీస బెనిఫిట్ రూ.2.5 ల‌క్ష‌ల వ‌ర‌కు హామీ ఇస్తున్న‌ది.

మ‌ర‌ణించిన కార్మికుల కుటుంబ స‌భ్యుల‌కు క‌నీసం రూ.2.5 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాల‌న్న నిబంధ‌న‌ను పున‌రుద్ధ‌రించారు. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 15 నుంచి ఈ నిబంధ‌న అమ‌లులోకి వ‌చ్చింది.

2021-22 నుంచి 2023-24 వ‌ర‌కు వ‌చ్చే మూడేండ్ల‌లో అర్హులైన కుటుంబ స‌భ్యుల‌కు ఈడీఎల్ఐ నిధి కింద రూ.2,185 కోట్లు అద‌న‌పు ఖ‌ర్చ‌వుతుంద‌ని కార్మిక‌శాఖ అంచ‌నా వేసింది.

ఈ స్కీం కింద ఏడాదిలో సుమారు 50 వేల కార్మికుల కుటుంబాలు క్లెయిమ్‌లు చేస్తాయని అంచ‌నా. క‌రోనాతో కార్మికులు మ‌ర‌ణిస్తే సుమారు 10 వేల కార్మికుల కుటుంబాలు అద‌నంగా ఈ స్కీమ్ కోసం క్లెయిమ్ చేయొచ్చున‌ని అంచ‌నా.

ఇవి కూడా చ‌ద‌వండి:

అక్కెర‌కురాని ముచ్చ‌ట్ల‌తో లాభం లేదు.. ప్ర‌ధాని మ‌న్ కీ బాత్‌పై రాహుల్‌గాంధీ ఫైర్

ప్రియుడితో క‌లిసి సొంతింట్లోనే యువ‌తి దొంగ‌త‌నం

ఈఎస్ఐసీ ద్వారా ఫ్యామిలీ పెన్షన్…

IPL 2021: ఐపీఎల్‌ కోసం సీపీఎల్‌ షెడ్యూల్‌ మార్పు

మార్స్‌పై మేఘాల‌ను చూశారా.. క్యూరియాసిటీ పంపిన అద్భుత‌మైన ఫొటోలు

బుల్లెట్ బైక్‌ కోసం వ‌రుడి డిమాండ్‌.. ఊహించ‌ని షాక్ ఇచ్చిన వ‌ధువు

మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌స్తా.. పార్టీని గాడిలో పెడ‌తా!

ప్రియుడితో క‌లిసి సొంతింట్లోనే యువ‌తి దొంగ‌త‌నం

బుల్లెట్ బైక్‌ కోసం వ‌రుడి డిమాండ్‌.. ఊహించ‌ని షాక్ ఇచ్చిన వ‌ధువు

పీపీఈ కిట్ వేసుకొని.. కొవిడ్ పేషెంట్ మృత‌దేహాన్ని న‌దిలో ప‌డేస్తూ.. షాకింగ్ వీడియో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కోవిడ్ మృతుల‌ కుటుంబాల‌కు ఈఎస్ఐ బెనిఫిట్లు ఇలా!

ట్రెండింగ్‌

Advertisement