e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 23, 2021
Home News వ‌జ్రాల వ్యాపారి ధోలాకియా.. ముంబైలో ల‌గ్జ‌రీ బిల్డింగ్ సొంతం ఇలా..!

వ‌జ్రాల వ్యాపారి ధోలాకియా.. ముంబైలో ల‌గ్జ‌రీ బిల్డింగ్ సొంతం ఇలా..!

ముంబై: సావ్జీ ధాన్జీ ధోలాకియా ఓ వ‌జ్రాల వ్యాపారి. సూర‌త్ కేంద్రంగా వ్యాపార కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తారు. దాతృత్వానికి ఆయ‌న పెట్టింది పేరు. హ‌రి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ పేరిట కంపెనీని ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ముంబైలోని విలాస‌వంత‌మైన ప్రాంతం వ‌ర్లీలో సీ ఫేస్‌లో ఆరంత‌స్థుల నివాస భ‌వ‌నాన్ని సావ్జీ ధాన్జీ ధోలాకియా సొంతం చేసుకున్నారు. ఈ సంగ‌తిని అధికారికంగా ధ్రువీక‌రించారు. ఈ భ‌వ‌నం విలువ రూ.185 కోట్లు. హ‌రి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ‌కు ఈ భ‌వ‌నాన్ని ఎస్సార్ గ్రూప్ అనుబంధ ఆర్కే హోల్డింగ్స్ విక్ర‌యించింది.

20 వేల అడుగుల విస్తీర్ణంలో భ‌వ‌నం

పాన్‌హ‌ర్‌గా పేరొందిన ఈ భ‌వ‌నం దాదాపు 20వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో విస్త‌రించింది. ఈ మేర‌కు శుక్ర‌వారం హ‌రి కృష్ణ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీకి ఎస్సార్ గ్రూప్ రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసింది. బేస్‌మెట్‌, గ్రౌండ్ ఫ్లోర్ ప్ల‌స్ ఆరు అంత‌స్తులు ఉన్నాయి. ఒక చ‌ద‌ర‌పు అడుగు ధ‌ర రూ.93 వేలు ప‌లికింది.

ఇలా రిజిస్ట్రేష‌న్లు.. ఇండియా బుల్స్ ఫైనాన్స్‌

- Advertisement -

దీని రిజిస్ట్రేష‌న్ రెండు ర‌కాలుగా జ‌రిగింది. ఇందులో 1350 చ‌ద‌ర‌పు మీట‌ర్ల స్థ‌లం లీజ్ కింద రూ.47 కోట్లకు రిజిస్ట్రేష‌న్ చేశారు. దీనిపై 5 శాతం స్టాంప్ డ్యూటీ రూ.2.57 కోట్లు చెల్లించారు. ఈ భూమి కొనుగోలు చేయ‌డానికి హ‌రికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ‌కు ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ నేరుగా రూ.36.5 కోట్ల రుణం కింద చెల్లించింది.

నివాస భ‌వ‌నం ధ‌ర రూ.138 కోట్ల‌తోపాటు ఆరు శాతం స్టాంప్‌డ్యూటీ రూ.8.3 కోట్లు. ఒక‌శాతం సెస్ రూ.1.38 కోట్లు మిన‌హా స్టాంప్ డ్యూటీ రూ.6.91 కోట్లు చెల్లించారు. ఇందులో రూ.108.25 కోట్లు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ నేరుగా చెల్లించింది.

సిబ్బందికి గిఫ్ట్‌లుగా ఇండ్లు.. కార్లు

గ‌తంలో త‌న సంస్థ‌లోని ముగ్గురు ఉద్యోగుల‌కు విలాస‌వంత‌మైన మెర్సిడెస్ బెంజ్ కార్ల‌ను గిఫ్ట్‌లుగా అంద‌చేసి వార్త‌ల‌కెక్కారు. స‌రిగ్గా ఐదేండ్ల క్రితం 2016లో దీపావ‌ళి సంద‌ర్భంగా ఉద‌యోగుల‌కు 400 ఇండ్ల ఫ్లాట్లు, 525 ఇండ్ల స్థ‌లాలు, 1260 కార్లు బ‌హుమతులు ఇచ్చారు. హ‌రికృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థ‌లో 5000 మంది ఉద్యోగులు ప‌ని చేస్తున్నారు. వార్షిక ట‌ర్నోవ‌ర్ రూ.6000 కోట్లు అని తెలుస్తున్న‌ది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి:

Conflict in Hero Family| హీరో ఫ్యామిలీలో ర‌చ్చ‌.. ‘ముంజాల్స్‌’లో విభేదాలు.. ఎందుకంటే?!

Oxygen : చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్‌ కనిపెట్టిన ప్రీస్ట్లీ

Asaduddin Owaisi: మోదీకి హిందూ మ‌హిళ‌ల సాధికార‌త అక్క‌ర్లేదా..?

TS Cabinet : వ‌చ్చే ఏడాది నుంచి కొత్త మెడిక‌ల్ కాలేజీలు ప్రారంభం

TS Cabinet : 5 సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌కు త్వ‌ర‌లోనే శంకుస్థాప‌న‌

Sai Pallavi Tamil | కోలీవుడ్ క‌మ్‌బ్యాక్ కు సాయి ప‌ల్ల‌వి ప్లాన్..?

పుష్ప2 లో నెగెటివ్ రోల్ చేయ‌నున్న సోనూసూద్.. ప్రేక్ష‌కులు అంగీక‌రిస్తారా..!

Hyderabad biryani | హైద‌రాబాదీ బిర్యానీ ఒక్క‌టేనా.. ఈ ప‌ది బిర్యానీల రుచి చూశారా

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana