ఒకప్పుడు విలన్‌గా ప్రేక్షకులకి సుపరిచితుడైన సోనూసూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారాడు. ఇప్పుడు ఆయనని వెండితెరపై విలన్‌గా చూసేందుకు ప్రేక్షకులు ఏ మాత్రం ఇష్టపడడం లేదు. ఆ మధ్య ఓ బుడతడు సోనూసూద్‌ని హీరో కొడుతుండడం చూసి టీవీ పగలగొట్టాడు. ఇక రీసెంట్గా ఆచార్య సినిమాలో సోనూసూద్ పాత్రకు లుక్ విడుదల చేయగా,దీనిపై నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి.
సామాజిక సేవలోనూ హీరోగా వెలుగుతున్న సోనూసూద్‌ని ఇప్పుడు ప్రజలు విలన్ పాత్రలో చూసేలా లేరు. రేపు ఆచార్య రిలీజ్ అయితే ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ఆచార్య చిత్రంలో సోనూ విలన్‌గా నటించగా, ఈ సినిమా షూటింగ్ కోసం కొద్ది రోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉంటున్నారు.
ఇక సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, పుష్ప 1లో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో కీలక పాత్ర కోసం సోనూ సూద్ ను నిర్మాతలు సంప్రదించినట్లు కథనాలొస్తున్నాయి. మరి ఇదే నిజమైతే, పెద్దతెరపై హీరో ఇష్టానుసారం తన్నేస్తుంటే అభిమానులు చూసేందుకు సిద్ధంగా ఉన్నారంటారా? అనేది రానున్న రోజులలో తెలియనుంది.