TS Cabinet : 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు త్వరలోనే శంకుస్థాపన
TS Cabinet | ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలపై చర్చించారు. వీటి సత్వర

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాలపై చర్చించారు. వీటి సత్వర నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యలు, ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై చర్చించారు. త్వరలోనే వీటి నిర్మాణానికై శంకుస్థాపన చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. వరంగల్ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, టిమ్స్, ఎల్.బి. నగర్, గడ్డి అన్నారం, అల్వాల్ లలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది.
పటాన్చెరులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
పటాన్ చెరులో కార్మికులు, ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ను కేబినెట్ మంజూరు చేసింది. అన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖాన్లను ఇక నుంచి ‘‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’’ ( TIMS ) గా నామకరణం చేసి, అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్క చోటనే అందించే సమీకృత వైద్య కళాశాలలుగా తీర్చిదిద్ది, సత్వరమే వైద్యసేవలను ప్రారంభించాలని కేబినెట్ వైద్యాధికారులను ఆదేశించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

