Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav | సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు (Samajwadi Party chief) అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) బీజేపీ (BJP) పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రపూరితంగా ఓటర్ల జాబితాను తారుమారు చేస్తోందని, దొంగ ఓట్లను చేర్పించడంతోపాటు ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను తొలగిస్తోందని ఆయన విమర్శించారు.
Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు (Samajwadi Party chief) అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) బీజేపీ (BJP) పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రపూరితంగా ఓటర్ల జాబితాను తారుమారు చేస్తోందని, దొంగ ఓట్లను చేర్పించడంతోపాటు ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను తొలగిస్తోందని ఆయన విమర్శించారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
పోలింగ్ బూత్‌ల వద్ద పార్టీ కార్యకర్తలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా అవకతవకలు గుర్తిస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని అఖిలేష్ సూచించారు. మోసం, నిజాయతీ లేకపోవడాన్నే బీజేపీ తన బలంగా భావిస్తున్నదని, అందుకే ఇలాంటి కుట్రలకు పాల్పడుతోందని అఖిలేశ్ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రకటించిన తర్వాత అఖిలేశ్ ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవలే వేల కోట్లు ఖర్చుపెట్టి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తిచేసిన తర్వాత మళ్లీ ఇప్పుడు SSR అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం బీజేపీకి అనుకూలంగా జాబితాను మార్చేందుకేనని ఆయన ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Akhilesh Yadav
- BJP
- sir
- SP Chief
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

