e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, July 30, 2021
Home News Chip shortage | ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల స‌ప్ల‌య్‌-డిమాండ్ మ‌ధ్య గ్యాప్‌.. 2022 వ‌ర‌కు ఇంతే!

Chip shortage | ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల స‌ప్ల‌య్‌-డిమాండ్ మ‌ధ్య గ్యాప్‌.. 2022 వ‌ర‌కు ఇంతే!

Chip shortage | ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల స‌ప్ల‌య్‌-డిమాండ్ మ‌ధ్య గ్యాప్‌.. 2022 వ‌ర‌కు ఇంతే!

న్యూఢిల్లీ: క‌రోనా వేళ ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌ర్క్ ఫ్రం హోం క‌ల్చ‌ర్ పెరిగిపోవ‌డంతో ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల‌కు డిమాండ్ ఏర్పడింది. కానీ తొలి త్రైమాసికంలో డిమాండ్‌- స‌ర‌ఫ‌రా మ‌ధ్య అంత‌రాయం 45 శాతం పెరిగింది. దీంతో 2021 తొలి అర్ధ‌భాగంలో 7.56 కోట్ల ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల కొర‌త నెల‌కొంది.

కొవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ‌ల్ల చిప్‌ల కొర‌త ( Chip shortage ) స‌మ‌స్య త‌లెత్తింద‌ని నిపుణులు తెలిపారు. క‌రోనాతో ప్ర‌పంచ వ్యాప్తంగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో స‌హా ఇత‌ర ఎల‌క్ట్రానిక్ పరిక‌రాల‌కు డిమాండ్ పెరిగింది.

ఇలా ఆటోమేక‌ర్ల ఆర్డ‌ర్లు ర‌ద్దు

- Advertisement -

గ‌తేడాది మార్చిలో లాక్‌డౌన్ కార‌ణంగా ఆటోమొబైల్ కంపెనీలు చిప్‌ల కొనుగోళ్ల‌కు ఇచ్చిన ఆర్డ‌ర్లు ర‌ద్దు చేశాయి. ఇప్పుడు అన్‌లాక్ ప్ర‌క్రియ ప్రారంభం కాగానే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫ్యాక్ట‌రీలు తెరుచుకున్నాయి.

Chip shortage | ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల స‌ప్ల‌య్‌-డిమాండ్ మ‌ధ్య గ్యాప్‌.. 2022 వ‌ర‌కు ఇంతే!

చిప్‌ల‌కు ఇలా పెరిగిన డిమాండ్‌

వ‌ర్క్ ఫ్రం హోం, స్ట‌డీ ఫ్రం హోం క‌ల్చ‌ర్ డెవ‌ల‌ప్ కావ‌డంతోపాటు ప‌ర్స‌న‌ల్ మొబిలిటీ ఎక్కువైంది. అటు ఎల‌క్ట్రానిక్, ఇటు ఆటోమొబైల్ రంగాల్లో చిప్‌ల వాడ‌కం పెరిగింది. 2020లో లాక్‌డౌన్‌తో ఫ్యాక్ట‌రీలు మూత ప‌డ‌టంతో చిప్‌ల త‌యారీ నిలిచి పోయింది. అన్‌లాక్ త‌ర్వాత డిమాండ్ పెర‌గ‌డంతో చిప్‌ల కొర‌త ఎక్కువైంది.

ద్వితీయార్థంలో వీటి త‌యారీపై ప్ర‌తికూల ప్ర‌భావం

ఈ ఏడాది ద్వితీయార్థంలో ప‌ర్స‌న‌ల్ కంప్యూటర్ బ్రాండ్లు, ఓడీఎం (వ‌ర్జిన‌ల్ డిజైన్ మాన్యుఫాక్చ‌రింగ్‌) త‌యారీపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని అంచ‌నా. తొలి త్రైమాసికంలో ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్స్ సేల్స్‌లో లెనెవో 24 శాతం, హెచ్‌పీ 23, డెల్ 17 శాతం మార్కెట్ షేర్ పొందాయి.

క్రోమ్ బుక్స్‌కు ఇలా డిమాండ్‌

వ‌ర్క్ ఫ్రం హోం, స్ట‌డీ ఫ్రం హోం సెగ్మెంట్స్‌, గేమింగ్ నోట్‌బుక్స్ కోసం డిమాండ్ పెరిగింది. గేమింగ్ నోట్‌బుక్స్ ట్రెండ్ పురోభివ్రుద్ధి సాధించ‌డంతో క్రోమ్ బుక్స్ సేల్స్ ఎక్కువ‌య్యాయ‌ని కౌంట‌ర్ పాయింట్ రీసెర్చ్ విశ్లేషించింది.

పీసీల త‌యారీకి ఇవీ కొర‌త‌

పర్సనల్ కంప్యూటర్ల తయారీలో ప‌వ‌ర్ మేనేజ్మెంట్ ఐసీ, డిస్‌ప్లే డ్రైవ‌ర్ ఐసీ (విత్ డిస్‌ప్లే ప్యానెల్‌), సీపీయూ వంటి ప్ర‌ధాన విడి భాగాల కొర‌త వెంటాడుతున్నది. వాస్తవంగా విడి భాగాల కొరత ద్వితీయ త్త్రైమాసికంలో మొదలవుతుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనలిస్ట్ విలియమ్ లీ పేర్కొన్నారు.

Chip shortage | ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల స‌ప్ల‌య్‌-డిమాండ్ మ‌ధ్య గ్యాప్‌.. 2022 వ‌ర‌కు ఇంతే!

పీసీ సెగ్మెంట్‌లో 20-30 శాతం గ్యాప్‌

ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల షిప్‌మెంట్‌లో ప్ర‌స్తుతం 20-30 శాతం గ్యాప్ క‌నిపిస్తున్న‌ద‌ని విలియం లీ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ఆడియో కోడెక్ ఐసీ, లాన్ చిప్ వంటి ప‌రిక‌రాల‌కు డిమాండ్ ఉంద‌ని, ఈ ఏడాది ద్వితీయార్థం వ‌ర‌కు ఇలాగే ఉంటుంద‌న్నారు.

2022 తొలి అర్థ భాగానికి సాధార‌ణ ప‌రిస్థితులు

వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థం నాటికి డిమాండ్‌-స‌ర‌ఫ‌రా మ‌ధ్య గ్యాప్ క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్ర‌స్తుత ప‌రిస్థితే కొన‌సాగుతుంద‌ని భావిస్తున్నారు. బ్యాక్ టూ స్కూల్ (కొన్ని వ‌ర్చువ‌ల్ త‌ర‌గ‌తులు) అమ‌లులోకి వ‌చ్చినా తొలి అర్థ‌భాగంలో మాదిరిగానే ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల‌కు డిమాండ్ భారీగా ఉంటుంద‌ని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

ఐసీఐసీఐ బ్యాంక్‌ కొత్త చార్జీలు

పేటీఎంకు ప్రెసిడెంట్‌ గుడ్‌బై

గుడ్ న్యూస్‌.. ప్ర‌త్య‌క్ష ప‌న్ను వ‌సూళ్లు రెట్టింపు.. ఎంతంటే..!:

కార్ల‌పై ఇన్‌ఫుట్ కాస్ట్ దెబ్బ‌.. మ‌హీంద్రా థార్ ధ‌రెంతంటే?!

ఇంధ‌న డిమాండ్‌.. జూన్‌లో రిక‌వ‌రీ.. ఎలాగంటే..!!

చౌక‌గా లాప్‌టాప్‌లు.. రూ.24 వేల లోపు రెడీ.. ఇవీ డిటైల్స్‌..

బ్యాంకింగ్ అవ‌క‌త‌వ‌క‌ల‌కు చెల్లు.. అందుకు ఆర్బీఐ కంప‌ల్స‌రీ లీవ్

ఐటీ ఫ్రెషర్స్‌కు జోష్‌

డౌన్‌లోడ్‌లో జియోనే స్పీడ్‌

జ‌నాభా నియంత్ర‌ణ త‌ప్ప‌నిస‌రి: శ‌ర‌ద్ ప‌వార్

కరోనా నుంచి కోలుకున్నాడు.. ఎవరెస్ట్‌ను అధిరోహించాడు

మోదీ కేబినెట్‌లో 90 శాతం మంది కోటీశ్వ‌రులే..

ప‌ద్మ అవార్డుల‌కు మీరే నామినేట్ చేయండి.. ప్ర‌జ‌ల‌ను కోరిన ప్ర‌ధాని మోదీ

దిగివ‌చ్చిన ట్విట‌ర్‌.. ఫిర్యాదు అధికారిగా విన‌య్ ప్ర‌కాశ్ నియామ‌కం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Chip shortage | ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల స‌ప్ల‌య్‌-డిమాండ్ మ‌ధ్య గ్యాప్‌.. 2022 వ‌ర‌కు ఇంతే!
Chip shortage | ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల స‌ప్ల‌య్‌-డిమాండ్ మ‌ధ్య గ్యాప్‌.. 2022 వ‌ర‌కు ఇంతే!
Chip shortage | ప‌ర్స‌న‌ల్ కంప్యూట‌ర్ల స‌ప్ల‌య్‌-డిమాండ్ మ‌ధ్య గ్యాప్‌.. 2022 వ‌ర‌కు ఇంతే!

ట్రెండింగ్‌

Advertisement