e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home బిజినెస్ డౌన్‌లోడ్‌లో జియోనే స్పీడ్‌

డౌన్‌లోడ్‌లో జియోనే స్పీడ్‌

న్యూఢిల్లీ, జూలై 9: రిలయన్స్‌ జియో 4జీ నెట్‌వర్క్‌లో తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటున్నది. జూన్‌లోనూ డౌన్‌లోడ్‌ స్పీడ్‌లో జియోనే టాప్‌ అని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ తాజాగా ప్రకటించింది. అయితే అప్‌లోడ్‌లో వొడాఫోన్‌ ఐడియా (వీఐ) ముందున్నదని పేర్కొన్నది. జియో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 21.9 ఎంబీపీఎస్‌గా ఉండగా, వొడాఫోన్‌ ఐడియా అప్‌లోడ్‌ డేటా స్పీడ్‌ 6.2 ఎంబీపీఎస్‌గా ఉందని తాజా గణాంకాల్లో వెల్లడించింది. కాగా, ఎయిర్‌టెల్‌ 4జీ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ సగటు స్వల్పంగా పెరిగిందని, అయినప్పటికీ ఇంకా తక్కువ స్థాయిలో 5 ఎంబీపీఎస్‌గానే ఉందని పేర్కొన్నది. వొడాఫోన్‌ ఐడియా డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 6.5 ఎంబీపీఎస్‌గా ఉన్నది. ఇక బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలను అందిస్తున్నా దాని నెట్‌వర్క్‌ స్పీడ్‌ మాత్రం ట్రాయ్‌ జాబితాలో లేకపోవడం గమనార్హం.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana