మోదీ కేబినెట్లో 90 శాతం మంది కోటీశ్వరులే..

న్యూఢిల్లీ: ఈ మధ్య కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేబినెట్ విస్తరణ చేపట్టిన విషయం తెలుసు కదా. దీంతో కేబినెట్లో మొత్తం మంత్రుల సంఖ్య 78కి చేరింది. అయితే వీళ్లలో 90 శాతం మంది కోటీశ్వరులే కాగా.. 42 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక వెల్లడించింది. అందులోనూ నలుగురిపై హత్యాయత్నం కేసులు ఉన్నట్లు తెలిపింది. బుధవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో మొత్తం 43 మంది మంత్రులుగా ప్రమాణం చేయగా.. అందులో 15 మందికి కేబినెట్ హోదా, మరో 28 మందికి సహాయ మంత్రులుగా అవకాశం కల్పించారు.
24 మందిపై తీవ్రమైన కేసులు
కొత్త మంత్రివర్గాన్ని ఏడీఆర్ విశ్లేషించింది. వీళ్ల ఎన్నికల అఫిడవిట్లను ఆధారంగా చూపుతూ.. 33 మంది మంత్రులపై క్రిమినల్ కేసులున్నట్లు వెల్లడించింది. వీళ్లలో 24 మందిపై హత్య, హత్యాయత్నం, దోపిడీ వంటి తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. రాజకీయ నాయకుల అఫిడవిట్లను పరిశీలిస్తూ.. ఎన్నికలకుముందు ఏడీఆర్ ఇలా రిపోర్టులను రూపొందిస్తుంది.
90 శాతం కోటీశ్వరులే
ఇక కొత్త కేబినెట్లో 70 మంది మంత్రులు కోటీశ్వరులే అని కూడా ఏడీఆర్ రిపోర్ట్ స్పష్టం చేసింది. అంటే వీళ్ల కనీస సంపద రూ.కోటిపైనే ఉన్నట్లు అఫిడవిట్లలో చూపించారు. నలుగురు మంత్రుల ఆస్తులు రూ.50 కోట్ల కంటే ఎక్కువ ఉన్నట్లు కూడా ఏడీఆర్ తెలిపింది. వీళ్లలో జ్యోతిరాదిత్య సింధియా (రూ.379 కోట్లు) తొలిస్థానంలో ఉండగా.. పియూష్ గోయల్ (రూ.95 కోట్లు), నారాయణ్ రాణె (రూ.87 కోట్లు), రాజీవ్ చంద్రశేఖర్ (రూ.64 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ప్రతి మంత్రి సగటు సందప రూ.16.24 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ స్పష్టం చేసింది. ఇక కొత్త మంత్రివర్గంలో అతి తక్కువ ఆస్తులున్నట్లు చూపించిన వాళ్లలో త్రిపురకు చెందిన ప్రతిమా భౌమిక్ (రూ.6 లక్షలు), పశ్చిమ బెంగాల్ నుంచి జాన్ బార్లా (రూ.14 లక్షలు), రాజస్థాన్ నుంచి కైలాష్ చౌదరి (రూ.24 లక్షలు), ఒడిశా నుంచి బిశ్వేశ్వర్ తుడు (రూ.27 లక్షలు), మహారాష్ట్ర నుంచి వి. మురళీధరన్ (రూ.27లక్షలు) ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

