పద్మ అవార్డులకు మీరే నామినేట్ చేయండి.. ప్రజలను కోరిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: క్షేత్రస్థాయిలో అసాధారణ పనులు చేస్తున్న వ్యక్తులను పద్మ అవార్డుల కోసం మీరే నామినేట్ చేయండి అంటూ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండియాలో ఇలా క్షేత్రస్థాయిలో అద్భుతమైన పనులు చేస్తున్న నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఎంతోమంది ఉన్నా.. సాధారణంగా వాళ్లు ఎవరికీ తెలియకుండా ఉండిపోతారని ట్విటర్లో మోదీ అన్నారు. సమాజంలో ఇలాంటి ఎంతో మంది వ్యక్తులను మనం చూడము, వారి గురించి వినము. అలాంటి వ్యక్తుల గురించి మీకు తెలుసా? వాళ్లను మీరు పీపుల్స్ పద్మ కోసం నామినేట్ చేయండి.
నామినేషన్లు సెప్టెంబర్ 15 వరకూ తెరిచే ఉంటాయి. http://padmaawards.gov.in లోకి వెళ్లి మీరు ఆ వ్యక్తులను నామినేట్ చేయవచ్చు అని మోదీ చెప్పారు. దేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న తర్వాత పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ నిలుస్తాయి. మోదీ ప్రభుత్వం కొన్నేళ్లుగా ఇలా క్షేత్రస్థాయిలో సేవలు చేస్తూ బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని ఎంతో మంది వ్యక్తులకు పద్మ అవార్డులు ప్రకటిస్తోంది.
India has many talented people, who are doing exceptional work at the grassroots. Often, we don’t see or hear much of them. Do you know such inspiring people? You can nominate them for the #PeoplesPadma. Nominations are open till 15th September. https://t.co/BpZG3xRsrZ
— Narendra Modi (@narendramodi) July 11, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

