Gold Rates | గోల్డ్ ప్రియులకు శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్న బంగారం ధరలకు (Gold Rates) కాస్త బ్రేక్ పడింది. నేడు గోల్డ్ రేటు గరిష్టంగా రూ. 1860 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ,1,860 తగ్గి రూ.1,22,290కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి రూ,1,700 పతనమై రూ.1,12,100 పలుకుతోంది. అదే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,22,440కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,12,200గా పలుకుతోంది. ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,100గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,22,290గా ఉంది.
ఇదిలా ఉండగా వెండి (Silver) ధర మాత్రం ఆల్‌టైమ్ హైకి చేరింది. ఏకంగా రూ.2 లక్షల చేరువలోకి వెళ్లింది. నేడు హైదరాబాద్‌లో కిలో వెండి రూ.3,000 పెరిగి ధర రూ.1,80,000కి ఎగబాకింది. కాగా, ఐదు రోజుల్లోనే కిలో వెండి ధర రూ.15 వేలు పెరగడం గమనార్హం. రానున్న రోజుల్లో వెండి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read..
ఈ స్టాక్స్‌కు ఏమైంది?.. బంగారం, వెండి ధరలు భారీగా పెరిగినా నష్టాల్లో జ్యుయెల్లరీ షేర్లు
దేశీయ శ్రీమంతుడు ముకేశ్.. 105 బిలియన్ డాలర్ల సంపదతో: ఫోర్బ్స్ మ్యాగజైన్ వెల్లడి