ముంబై, అక్టోబర్ 9: దేశీయ స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఐటీ, బ్లూచిప్ సంస్థల షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతోపాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 398.44 పాయింట్లు అందుకొని 82,172.10 పాయింట్ల వద్ద ముగిసింది.
మరోవైపు, ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 135.65 పాయింట్లు అందుకొని 25,181.80 వద్ద స్థిరపడింది. ఐటీ రంగానికి చెందిన హెచ్‌సీఎల్ టెక్నాలజీ, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగిశాయి. వీటితోపాటు టాటా స్టీల్, అల్ట్రాటెక్, భారత్ ఎలక్ట్రానిక్స్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, రిలయన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. కానీ, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, మారుతి, టాటా మోటర్స్ షేర్లు నష్టపోయాయి.