e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News క‌రోనా ఎఫెక్ట్‌.. భార‌త్ స్మార్ట్ ఫోన్ల‌కు సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త‌!!

క‌రోనా ఎఫెక్ట్‌.. భార‌త్ స్మార్ట్ ఫోన్ల‌కు సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త‌!!

క‌రోనా ఎఫెక్ట్‌.. భార‌త్ స్మార్ట్ ఫోన్ల‌కు సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త‌!!

న్యూఢిల్లీ: ప్ర‌పంచ మాన‌వాళితోపాటు వివిధ రంగాల ప‌రిశ్ర‌మ‌లు, ఆర్థిక సేవ‌ల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి స్తంభింప జేసింది. విశ్వ‌మారి వ‌ల్ల దెబ్బ తిన్న రంగాల్లో మొబైల్స్‌, టీవీలు త‌దిత‌ర ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల‌ ప‌రిశ్ర‌మ నిలిచింది. ప్ర‌త్యేకించి భార‌త్ మొబైల్ ఫోన్ల‌కు అవ‌స‌ర‌మైన సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త‌ను ఎదుర్కొంటున్న‌ది.

దేశంలో మొబైల్ ఫోన్లు, టీవీలు, ఇత‌ర ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల త‌యారీకి అవ‌స‌ర‌మైన విడి భాగాలు, ముడి స‌రుకు చైనా, తైవాన్‌, వియ‌త్నాం నుంచే పంపిణీ అవుతుంది.

చైనాలోని వుహాన్‌లో పుట్టిన క‌రోనా వైర‌స్‌.. ఆ దేశంలో మాన్యుఫాక్చ‌రింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్ హ‌బ్‌, ఎక‌నామిక్ ప్రొడ‌క్ష‌న్ సెంట‌ర్‌గా నిలిచిన గ్యాంగ్‌ఝోను చుట్టుముట్టింది. 2020 మార్చి నుంచి గ్యాంగ్‌ఝోలో రికార్డు స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి.

తైవాన్‌, వియ‌త్నాంల‌లోనూ నూత‌న కేసులు పెరిగాయి. వియ‌త్నాంలో గ‌త నెల‌లో రెండు వారాలు శ్యామ్‌సంగ్‌, ఆపిల్ సప్ల‌య‌ర్స్ ఫాక్స్‌కాన్‌, ల‌క్స్‌షేర్ కార్యక‌లాపాల‌ను నిలిపేశాయి.

ప్ర‌పంచంలోనే అతిపెద్ద చిప్ మేక‌ర్ తైవాన్ సెమీ కండ‌క్ట‌ర్ మాన్యుఫాక్చ‌రింగ్ కంపెనీ (టీఎస్ఎంసీ) 24 గంట‌లూ షిఫ్టుల వారీగా పని చేసి చిప్‌ల ఉత్ప‌త్తికి ప్ర‌ణాళిక రూపొందించింది.

క‌రోనా ఎఫెక్ట్‌.. భార‌త్ స్మార్ట్ ఫోన్ల‌కు సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త‌!!

చైనాలోని గ్యాంగ్‌ఝౌ, వియ‌త్నాం, తైవాన్‌ల‌లో, కానీ కరోనా కేసులు పెరిగి ప‌రిస్థితులు అదుపు త‌ప్పితే జూన్‌లో భార‌త్‌కు అవ‌స‌ర‌మైన ముడి సరుకు, విడి భాగాల స‌ర‌ఫ‌రా భారీగా త‌గ్గుతుంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

భార‌త్‌లో స్మార్ట్‌ఫోన్ల అసెంబ్లింగ్‌కు అవ‌స‌ర‌మైన కాంపొనెంట్ల‌లో 85 శాతం ఈ మూడు దేశాల నుంచే స‌ర‌ఫ‌రా అవుతాయి. ఈ మూడు దేశాల్లో క‌రోనా కేసుల‌తో నెల‌కొన్న నూత‌న ప‌రివ‌ర్త‌న ద‌శ‌తో భార‌త్‌లో స్మార్ట్ ఫోన్ల త‌యారీకి ఆటంకం ఏర్ప‌డుతుంద‌న్న అభిప్రాయం వినిపిస్తున్న‌ది.

గ‌తేడాది సెప్టెంబ‌ర్ నుంచే గ్లోబ‌ల్ స్మార్ట్ ఫోన్ల ప‌రిశ్ర‌మ.. ముడి స‌రుకు, విడి భాగాలు.. ప్ర‌త్యేకించి సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌తను ఎదుర్కొంటున్న‌ది. అంతేకాదు.. క‌రోనా కేసులు మొబైల్ మార్కెట్లు షాంఘై/ బీజింగ్‌ల‌కు విస్త‌రిస్తే విడి భాగాల స‌ర‌ఫ‌రా చైన్‌లో అంత‌రాయం ఏర్ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు పేర్కొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

ఉద్యోగులకు ఆకర్షణీయ వీఆర్‌ఎస్‌?

కొత్త ఐటీ పోర్టల్‌లో సమస్యలు

3.5 సెకండ్లలో 100 కి.మీ వేగం

బెంజ్‌ అల్ట్రా-లగ్జరీ కారు

వృద్ధిరేటు 8.3%కు కుదించిన‌ ప్ర‌పంచ‌బ్యాంకు.. ఎందుకంటే?!

పియాజియో వ‌న్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ రేంజ్‌, వేరియంట్లు ఇలా..

ఫ్రాంక్లిన్‌పై సెబీ రూ.5 కోట్ల ఫైన్‌

వృద్ధిరేటు 8.3%కు కుదించిన‌ ప్ర‌పంచ‌బ్యాంకు.. ఎందుకంటే?!

ఆ రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఫైన్‌.. ఎందుకంటే?!

ఇరాన్‌పై ఆంక్ష‌లు ఎత్తేయ‌కుంటే పెట్రోల్ పైపైకే!

కోవిడ్ ఔష‌ధాల‌పై 5 శాతానికి జీఎస్టీ మిన‌హాయింపు? ఇంకా..!!

బిట్ కాయిన్ ఒక స్కాం.. డాల‌ర్‌కు వ్య‌తిరేకం

రేపు ఆకాశంలో ఆవిష్కృతమవనున్న అద్భుతం

జాతి వివ‌క్ష ట్వీట్లు.. చిక్కుల్లో మ‌రో ఇద్ద‌రు స్టార్ ఇంగ్లండ్ క్రికెట‌ర్లు

పీహెచ్‌సీలో ఆగిన రిఫ్రిజిరేట‌ర్‌.. గ‌డ్డ‌క‌ట్టిన 480 టీకా డోసులు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా ఎఫెక్ట్‌.. భార‌త్ స్మార్ట్ ఫోన్ల‌కు సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త‌!!

ట్రెండింగ్‌

Advertisement