Bhagyashree Borse | రామ్ పోతినేని-భాగ్యశ్రీ బోర్సే నిజంగా ప్రేమలో ఉన్నారా.. పెళ్లి రూమర్స్‌కు ఊతమిచ్చిన కామెంట్స్!
Bhagyashree Borse | సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య స్నేహం, ప్రేమ, పెళ్లి వార్తలు ఎప్పుడూ ఆసక్తికర చర్చలకు దారి తీస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి కేవలం పుకార్లుగానే మిగిలిపోతే, మరికొన్ని సందర్భాల్లో నిజమై వివాహ బంధంగా మారుతుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ఇలాంటి మరో లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Bhagyashree Borse | సినీ పరిశ్రమలో హీరో హీరోయిన్ల మధ్య స్నేహం, ప్రేమ, పెళ్లి వార్తలు ఎప్పుడూ ఆసక్తికర చర్చలకు దారి తీస్తుంటాయి. కొన్నిసార్లు ఇవి కేవలం పుకార్లుగానే మిగిలిపోతే, మరికొన్ని సందర్భాల్లో నిజమై వివాహ బంధంగా మారుతుంటాయి. ప్రస్తుతం టాలీవుడ్లో ఇలాంటి మరో లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే, తన అందం, గ్లామర్‌తో యువతను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆమె రామ్ పోతినేని సరసన ‘ఆంధ్రా కింగ్’ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది.
ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, షూటింగ్ సమయంలోనే రామ్-భాగ్యశ్రీ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఆ స్నేహమే క్రమంగా ప్రేమగా మారిందనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల తన తాజా చిత్రం ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ టాక్ షోలో భాగ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చనీయాంశంగా మారాయి. నా మొదటి ఇల్లు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అయితే, హైదరాబాద్ నా రెండో ఇల్లు. అది ఇప్పటికే ఫిక్స్ అయిపోయింది అని ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని పలువురు నెటిజన్లు, అభిమానులు భాగ్యశ్రీ త్వరలో తెలుగింటి కోడలిగా మారబోతుందా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు అయితే రామ్‌తో ఆమె సంబంధం నిజమేనని సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు.
అయితే గతంలో ఈ ప్రేమ వార్తలపై రామ్ పోతినేని ఇప్పటికే స్పందించారు. తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.నేను పాట రాసే సమయానికి హీరోయిన్ ఎంపికే జరగలేదు. అలాంటప్పుడు ఇప్పటివరకు చూడని అమ్మాయి కోసం నేను పాట ఎలా రాస్తాను? అంటూ రామ్ స్పందించాడు. అలాగే ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా సినిమాలపైనే ఉందని, ప్రేమ లేదా పెళ్లి గురించి ఆలోచించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలకు సంబంధించి రామ్ పోతినేని లేదా భాగ్యశ్రీ బోర్సే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇద్దరూ తమ కెరీర్లతో బిజీగా ఉన్నారు. అయితే భాగ్యశ్రీ చేసిన వ్యాఖ్యలు, వీరిద్దరిపై గతంలో వచ్చిన రూమర్లు మళ్లీ చర్చకు రావడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. నిజంగా వీరిద్దరి మధ్య ప్రేమ ఉందా? లేక ఇవన్నీ కేవలం పుకార్లేనా? అన్నది భవిష్యత్తులోనే తేలనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

