న్యూఢిల్లీ: కొందరికి రుణం లభించడం చాలా కష్టం.. మరికొందరికి చాలా తేలిగ్గా బ్యాంకు రుణాలు లభిస్తాయి. దానికి మూడు కారణాలు ఉన్నాయి. ఏ బ్యాంకైనా సరే మీకు వచ్చే ఆదాయం, దానిపై మీరు చేసే పొదుపు మొత్తాలను పరిగణనలోకి తీసుకుంటుంది. అటుపై సిబిల్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రుణం మంజూరు చేసే విషయమై ముందడుగు వేస్తాయి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు.
అత్యధిక రుణాల సెటిల్మెంట్లు క్రెడిట్ కార్డుల బిల్లుల విషయంలోనే జరుగుతుంటాయి. క్రెడిట్ కార్డుపై తీసుకునే రుణాలు ఖర్చుతో కూడుకున్నవి.. తక్కువ గడువు కలవి కూడా. అత్యధిక కేసుల్లో కస్టమర్లు క్రెడిట్ కార్డులపై తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించరు.
చాలా మంది క్రెడిట్ కార్డు రుణాలు తీసుకున్న వారు సెటిల్మెంట్లకు మొగ్గు చూపుతుంటారు. ఇంత వరకూ బాగానే ఉంది.. క్రెడిట్ కార్డు రుణాలను సెటిల్మెంట్ చేసిన ఖాతాదారుల సిబిల్ స్కోర్‌ను బ్యాంకులు తగ్గించేస్తాయి.
మీరు క్రెడిట్ కార్డు రుణం చెల్లింపు కోసం మీ ఖాతా నుంచి నగదు విత్ డ్రా చేశారనుకోండి. సంబంధిత బ్యాంకు ఈ సమాచారాన్ని సిబిల్‌కు తెలియజేస్తుంది. దానికి బదులు క్రెడిట్ కార్డు రుణాన్ని ముందుగానే క్లోజ్ చేసుకుంటే బెటర్.
క్రెడిట్ కార్డు రుణం గడువుకు ముందు బ్యాంకు అధికారులతో మాట్లాడి చెల్లించేస్తే వడ్డీ, ఇతర చార్జీలు మాఫీ అవుతాయి.
క్రెడిట్ కార్డు దారుడు, దానిపై తీసుకున్న రుణం చెల్లించలేడని నిర్దారణకు వచ్చిన తర్వాతే బ్యాంకర్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారు. క్రెడిట్ కార్డు రుణం సెటిల్మెంట్ చేసుకున్న తర్వాత మిగతా సొమ్ము సదరు బ్యాంకు ఖాతాలోనే ఉండాలి
నాలుగేండ్ల తర్వాత రుణం తీసుకోవచ్చని మీరెప్పుడైనా భావించొచ్చు. కానీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే మీకు రుణం మంజూరు కావడం చాలా కష్టంగా ఉంటుంది.
సిబిల్ నుంచి మీ పేరు విత్‌డ్రా చేసుకుంటే, రుణంపై నాలుగేండ్లకు వడ్డీ, చార్జీలు చెల్లించాలని బ్యాంకర్ కోరతారు. ఇటువంటప్పుడు రుణం తీసుకోవడం మీకు కష్ట సాధ్యంగా మారుతుంది.
ఎవరికైనా రుణం ఇవ్వాలంటే ఎంత వరకు సాధ్యం అని గణించడానికి సిబిల్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దేశంలోని అన్ని బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు దీన్ని అనుసరిస్తాయి. మీరు రెగ్యులర్‌గా రుణ వాయిదాలు చెల్లిస్తూ ఉంటే, మీ క్రెడిట్ స్కోర్ బాగుంటుంది. లేకపోతే పడిపోతుంది.
మీ రుణ చెల్లింపుల ఆధారంగా బ్యాంకులు మీ సిబిల్ స్కోర్‌ను తయారు చేస్తాయి. అటు తర్వాత అన్ని బ్యాంకులు తమ ఖాతాదారుల స్కోర్‌ను సిబిల్‌కు పంపుతాయి. ఇందుకోసం అన్ని బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నిబంధనలు జారీ చేసింది.
సిబిల్ స్కోర్ బాగుందనుకోండి.. మీరు తీసుకునే రుణంపై వడ్డీరేటులో రాయితీ లభిస్తుంది. సిబిల్ స్కోర్‌తో దేశంలోని పలు బ్యాంకులు నేరుగా అనుసంధానమై ఉంటాయి. ఈ స్కోర్‌పైనే రుణం మంజూరవుతుంది. సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే రుణం పొందడంలో ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి.
13న రాష్ర్ట మంత్రి వర్గ సమావేశం
స్టంట్ మాస్టర్లను ఎవరూ నమ్మరు : మంత్రి జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు
2 డీజీ ఔషధ ఉత్పత్తికి మరో కంపెనీకి అనుమతి
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
ఫన్88 బ్రాండ్ అంబాసిడర్‌గా డారెన్ సామి…
నాకు డ్రా ఈజీగానే ఉంది కానీ..: పీవీ సింధు
ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నా ధరల మంటతో ఉక్కిరిబిక్కిరి!
అన్‌లాక్ ప్రక్రియతో అందుబాటులోకి వచ్చిన మూడోవంతు కొలువులు!
జర్మనీ ఆటో సంస్థలపై రూ.7,500 కోట్ల ఫైన్
లగ్జరీ కార్లంటే యమ క్రేజ్.. పలు వేరియంట్లపై మోజు
ఢిల్లీలో మళ్లీ రూ.47 వేల దిగువకు బంగారం..!