Auto Expo 2025 : భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో – 2025 (Bharat Mobility Global Expo 2025) పై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ప్రపంచ, భారతీయ కార్ల తయారీదారులు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే అనేక బ్రాండ్లు తమ లాంచ్‌లను గురించి ప్రకటించాయి. కియా, మహీంద్రా, హ్యుందాయ్ కంపెనీలు ఆటో ఎక్స్పో – 2025లో మొదటిసారిగా తమ ఉత్పత్తుల్లో కొన్నింటిని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరి 17 నుంచి 22వ తేదీ వరకు ఈ ఆటో ఎక్స్పో జరగనుంది.
మహీంద్రా కంపెనీ ఇటీవల ప్రకటించిన ఈవీ ఎస్యూవీ కూపే ఎక్స్ఈవీ 9ఈ మోడల్‌ను కూడా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే మహీంద్రా కంపెనీ ఈ మోడల్‌కు సంబంధించిన బుకింగ్, డెలివరీ టైమ్లైన్లతోపాటు దాని టాప్-స్పెక్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఈ ధరలు రూ.21.90 లక్షల నుంచి రూ.30.50 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటాయి. ఢిల్లీ, ముంబై, పుణె లాంటి ఫేజ్ 1 నగరాల్లో టెస్ట్ డ్రైవ్‌లను త్వరలో ప్రారంభిస్తారు.
కియా కంపెనీకి సంబంధించిన కియా సిరోస్ కారు ఆటో ఎక్స్పో – 2025లో ప్రదర్శనకు రానుంది. డిజైన్, ఫీచర్ లోడెడ్ క్యాబిన్ కియా సిరోస్ ప్రత్యేకతగా నిలువనుంది. ఈ ప్రీమియం సబ్‌కాంపాక్ట్ ఎస్యూవీ కోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ధరలను 2025 ఫిబ్రవరి 1న ప్రకటిస్తారు. సిరోస్ కారు ముందు, వెనుక వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ 12.3 అంగుళాల స్క్రీన్ సెటప్, అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలతోపాటు పీఎస్ 1 లీటర్ టర్బో-పెట్రోల్, 116 పీఎస్ 1.5 లీటర్ డీజిల్‌తో సహా రెండు ఇంజిన్ ఎంపికలతో అందిస్తున్నారు.
ఆటో ఎక్స్పో – 2025లో ఎలక్ట్రిక్ వాహనాల సందడి హైలైట్‌గా నిలిచేలా ఉంది. జనవరి 17 నుంచి 22 వరకు జరిగే ఈ వేడుకలో ప్రతి కంపెనీ తమ బ్రాండ్ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయడానికి ఉత్సాహంగా ఉన్నాయి. అలాంటి వాటిలో హ్యుందాయ్ కూడా ఒకటి. తన తొలి మాస్ EV కారు క్రెటా ఎలక్ట్రిక్‌ను ఆటో ఎక్స్పో 2025లో ప్రదర్శించనుంది. క్రెటా ఎలక్ట్రిక్తోపాటు హ్యుందాయ్ తన గ్లోబల్ పోర్ట్‌ఫోలియో నుండి స్టారియా MPV, అయోనిక్ 9 ఎలక్ట్రిక్ SUVలను కూడా ప్రదర్శించనుంది.
Ravichandran Ashwin | బయట అనుకునేవన్నీ నిజాలు కావు.. రిటైర్మెంట్పై భారత బౌలర్ అశ్విన్
Robotic Mules | ఆర్మీ అమ్ములపొదిలోకి 100 రోబోటిక్ డాగ్స్.. Video
Big discount | ఐఫోన్ 16పై భారీ డిస్కౌంట్లు.. ధర ఎంత తగ్గిందంటే..!
IT Returns | ఐటీ రిటర్న్స్ దాఖలుకు నేడే ఆఖరు.. గడువు దాటితే ఏమవుతుందంటే..!
Rahul Gandhi | కేజ్రీవాల్‌కు, ప్రధాని మోదీకి పెద్ద తేడా లేదు.. దొందూ దొందే : రాహుల్‌గాంధీ
Arvind Kejriwal | రాహుల్‌గాంధీని ఒక్క మాటంటే బీజేపీకి పొడుచుకొచ్చింది : అర్వింద్ కేజ్రీవాల్