మంగళవారం 11 ఆగస్టు 2020
Business - Jul 17, 2020 , 15:47:25

భార‌త్‌లో యూసీవెబ్‌ మూసివేత..ఉద్యోగుల తొలగింపు

భార‌త్‌లో యూసీవెబ్‌ మూసివేత..ఉద్యోగుల తొలగింపు

ఢిల్లీ:  చైనా ఇంటర్నెట్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌కు అనుబంధ సంస్థ యూసీ వెబ్‌(UC Web) భారత్‌లో కార్యకలాపాలను నిలిపివేసింది. దేశవ్యాప్తంగా కంపెనీలో పనిచేస్తున్న  350 మంది ఉద్యోగుల్లో ఇప్పటికే 90శాతం మందిని తొలగించింది.  అసోసియేట్‌, మేనేజ్‌మెంట్‌, ఎంట్రీ లెవల్‌ స్థానాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా తొలగింపు సమాచారాన్ని తెలియజేసింది. ఉద్యోగులందరికీ  కనీసం 30 రోజుల నోటీసు ఇచ్చినట్లు  కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. 

లఢఖ్‌లో  సరిహద్దు  వెంబడి  భారత్, చైనా మధ్య   ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్‌లపై  నిషేధం విధించిన విషయం తెలిసిందే.   భారత్‌లో 2009లో యూసీవెబ్‌  కార్యకలాపాలను ప్రారంభించింది. మొబైల్‌ బ్రౌజర్‌ యూసీ బ్రౌజర్‌తో పాటు యూసీ న్యూస్‌ తదితర సేవలను భారత్‌లో విస్తరించింది.  క్లబ్‌ ఫ్యాక్టరీ యాప్‌ను బ్యాన్‌ చేయడంతో  ఆ సంస్థ చెల్లింపులను నిలిపివేసింది. 


logo