భద్రాచలం: పూర్వ ఖమ్మం జిల్లా గిరిజన సంక్షేమశాఖ పరిధిలో నిర్వహిస్తున్న రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశాలువాయిదావేశారు. కిన్నెరసాని (బాలురు), కాచనపల్లి (బాలికలు)లోని రెండు మోడల్ స్పోర్ట్స్ స్కూల్స్ ప్రవేశాలు వాయిదా పడ్డాయి. 2021-22 విద్యా సంవత్సరానికి గానూ 5, 6తరగతుల్లో ప్రవేశాలకు ఎంపిక ప్రక్రియను వాయిదా వేసినట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ గౌతమ్ పొట్రు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో జిల్లా స్థాయి ఎంపిక ప్రక్రియను ఈ నెల 13 నుంచి 15వరకు నిర్వహించనున్నట్లు, ఫైనల్ సెలక్షన్స్ ఈ నెల 20 నుంచి 21వరకు మోడల్ స్పోర్ట్స్ స్కూల్ కిన్నెరసానిలో నిర్వహిస్తామని పీఓ పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం స్పోర్ట్స్ ఆఫీసర్ ఐటీడీఏ భద్రాచలం వారిని 8978477345, 9440154345 నెంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.