సోమవారం 30 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 20, 2020 , 01:51:59

ఉత్పత్తి ప్రారంభానికి చర్యలు తీసుకోండి-జీఎం రమేశ్‌

ఉత్పత్తి ప్రారంభానికి చర్యలు తీసుకోండి-జీఎం రమేశ్‌

మణుగూరు రూరల్‌: బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఏరియా జీఎం జక్కం రమేశ్‌ అన్నారు. బుధవారం మణుగూరు ఓసీని ఆయన అధికారులతో కలిసి సందర్శించారు. ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షాల వల్ల గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మణుగూరు ఓసీలో అధికారులతో చర్చించారు.